మెదక్, ఆగస్టు22 (నమస్తే తెలంగాణ): మెదక్లో డబు ల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు కోసం మొదటి విడుతలో 561 మంది అర్హులను గుర్తించినట్లు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 2656 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించి 1016 డబుల్ బెడ్రూం ఇండ్లకు మొదటి విడుత అర్హులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ జాబితాను కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్, ఎంపీడీవో, మెదక్ మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఈ జాబితాను ఉంచినట్లు తెలిపారు. ఈనెల 23న ప్రజావాణి హాల్లో లాటరీ పద్ధతిలో అర్హులకు ఇండ్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఇల్లు కేటాయించిన లబ్ధిదారులు 24న గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
సమస్యలు పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 21 దరఖాస్తులు వచ్చాయి. అందులో రెవెన్యూకు సంబంధించినవి కాగా మరో ఐదు వివిధ అంశాలకు సంబంధించినవి ఉన్నా యి. ఈ వినతులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్ శ్రీనివాస్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.