నర్సాపూర్/ కొల్చారం/ చిలిపిచెడ్/ శివ్వంపేట/ వెల్దుర్తి/ మనోహరాబాద్/ అల్లాదుర్గం, ఆగస్టు 20 : మునుగోడులో నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా సొంత వాహనాల్లో మునుగోడు సభకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల దీవెనలు సీఎం కేసీఆర్‌కే ఉన్నాయని, మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. సభకు వెళ్లినవారిలో వైస్‌ఎంపీపీ వెంకటనర్సింగరావు, మున్సిపల్ వైస్‌చైర్మన్ నయీమొద్దీన్, జడ్పీటీసీ బాబ్యానాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చం ద్రశేఖర్, నేతలు శ్రీధర్‌గుప్తా, భిక్షపతి, అశోక్‌గౌడ్, నగేశ్, సత్యంగౌడ్, రమణారావు, ఆంజనేయులుగౌడ్ ఉన్నారు.
కొల్చారం మండలం నుంచి 25 వాహనాల్లో సభకు వెళ్లా రు. వీరిలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్గుప్తా, టీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు సంతోష్‌కుమార్, రైతుబంధు మండల కోఆర్డినేటర్ భూపాల్‌రెడ్డి, ఏడుపాయల ఆలయ డైరెక్టర్లు కె.యాదాగౌడ్, బాగారెడ్డి, సర్పంచ్‌లు విష్ణువర్ధన్‌రెడ్డి, రాంరెడ్డి, శ్రీశైలం, నాయకులు వేమారెడ్డి, ఆంజనేయిలు, గౌరీశంకర్, నర్సింహులు, రవితేజరెడ్డి ఉన్నారు.
చిలిపిచెడ్ మండలం నుంచి సర్పంచ్‌లు పరశురాంరెడ్డి, ఇస్తారి, యాదగిరి, భిక్షపతినాయక్, మండల కోఆప్షన్ సభ్యు డు షఫి, రైతుబంధు జిల్లా సభ్యుడు సయ్యాద్హుస్సేన్, పీఏసీఎస్ డైరెక్టర్ అంబర్‌సింగ్, మాజీ సర్పంచ్ పొచయ్య తదిత రులు మునుగోడు సభకు తరలివెళ్లారు.
శివ్వంపేట మండలం నుంచి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, ఎంపీపీ హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, వైస్ ఎంపీపీ రమాకాంత్‌రెడ్డి, నేతలు గొర్రె వెంకట్‌రెడ్డి, చింతస్వామి, సోనీరవినాయక్ వెళ్లారు.
ప్రజాదీవెన సభకు వెల్దుర్తి, మాసాయిపేట మండలాల నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు వెళ్లారు. వీరిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భూపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, రైతుబంధు మండల కోఆర్డినేటర్ వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, ఆంజనేయులు, మోహన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రమేశ్చందర్, మల్లేశంగౌడ్, మైసయ్య, ఖాజా తదితరులు తరలివెళ్లారు.
మనోహరాబాద్ మండలం నుంచి పీఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఎంపీపీ నవనీతారవి, సర్పంచ్‌లు మహిపాల్‌రెడ్డి, రేఖామల్లేశ్, నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్ వెళ్లారు.
అల్లాదుర్గం మండలం నుంచి మాజీ ఎంపీపీ కాశీనాథ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహులు, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, సర్పంచ్ అంజియాదవ్, ఎంపీటీసీ దశరథ్, మాజీ సర్పంచ్ రమేశ్, పవన్, శివరాం, రాథోడ్, దుర్గారెడ్డి వెళ్లారు.