నారాయణఖేడ్, ఆగస్టు 16 : టీఆర్ఎస్తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. సిర్గాపూర్ మండలం పొట్పల్లి సర్పంచ్ గంగాబాయి, ఆరుగురు వార్డు సభ్యులు మంగళవారం కాంగ్రెస్‌ను వీడి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అభివృద్ధిని కాంక్షించే ప్రతిఒక్కరూ టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. గత ప్రభుత్వాలు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పడి తర్వాత నియోజకవర్గం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నదో ప్రజలకు తెలుసన్నారు. గతంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేని నాయకులు పాదయాత్రల పేరిట గ్రామాల్లో పర్యటిస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సర్పంచ్ గంగాబాయి తనయుడు వెంకట్రావుతో పాటు వార్డు సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు బాలరాజ్, అంబాదాస్, మారుతి, కృష్ణ, శ్యామల, సాయికిరణ్, నర్సింహులు, సంజీవులు, రాజు, అబ్రహం, తులసిరాం, పండరిలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవ్‌రావు, ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ రాఘవరెడ్డి, నాయకులు మాధవరావు, కృష్ణాగౌడ్ పాల్గొన్నారు.