తూప్రాన్/ మనోహరాబాద్/ శివ్వంపేట/ నర్సాపూర్/ చిన్నశంకరంపేట/ రామాయంపేట/ నిజాంపేట, ఆగస్టు 14 : యువత ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని అన్ని రంగాల్లో రాణించాలని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం దండుపల్లిలో క్రీడా ప్రాంగణాన్ని, స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పురం మహేశ్ముదిరాజ్, ఎంపీపీ నవనీతారవి ము దిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ లతావెంకట్గౌడ్, ఎస్సై రాజుగౌడ్, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, ఎంపీవో లక్ష్మీనర్సిం హులు, ఐకేపీ ఏపీఎం పెంటాగౌడ్, సర్పంచ్ పంజా లక్ష్మి, నాయకులు భిక్షపతి, చంద్రశేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.
తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో క్రీడా ప్రాంగణాన్ని డీఎల్పీవో శ్రీనివాస్ ప్రారంభించారు. ఆటల పోటీలను పర్య వేక్షించారు. క్రీడాపోటీల్లో ఇస్లాంపూర్, దాతర్పల్లి, ఘనాపూర్ గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో అరుంధతి, ఎంపీవో రమేశ్, సర్పంచ్ సుకన్యారమేశ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
శివ్వంపేట జడ్పీ స్కూల్లో ఆటపోటీలు
విద్యార్థులకు క్రీడలతో ఆరోగ్యంతోపాటు క్రమశిక్షణ అలవరుతుందని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శివ్వం పేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పోటీలను ప్రారంభించి, విద్యార్థులతో మాట్లాడారు. చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమన్నారు. ముందుగా శివ్వంపేటలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నవీన్‌కుమార్, ఎంఈవో బుచ్యానాయక్, పీఈటీ ఆంజనేయులు, నోడల్ ఆఫీసర్ సురేందర్ ఉన్నారు.
నర్సాపూర్ శివారులోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులకు క్రీడాపోటీలను అదనపు కలెక్టర్ ప్రారంభించారు.
విజయానికి కృషి చేయాలి : డీఈవో
క్రీడాకారులు విజయం సాధించడానికి కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ సూచించారు. వజ్రోత్సవాల్లో భాగంగా చిన్నశంకరంపేటలోని జడ్పీ పాఠశాలలో క్రీడా పోటీ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడు తూ.. క్రీడల్లో గెలుపు, ఓటమి సహజమని, విద్యార్థులు చదు వుతోపాటు ఆటల్లో రాణించాలన్నారు. క్రీడల్లోనూ జాతీయ స్ఫూర్తిని చాటాన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో గణేశ్‌రెడ్డి, ఎంపీవో గిరిధర్‌రెడ్డి, ఏఈవో, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళా శాల మైదానంలో నిర్వహిస్తున్న క్రీడాపోటీలను మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, కమిషనర్ ఉమాదేవి, ఎస్సై రాజేశ్ ప్రా రంభించారు. క్రీడాకారులు ఆటల్లో రాణించి, ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
డీ.ధర్మారం గ్రామంలో ఆటల పోటీలను మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీవో ఉమాదేవి, వైస్ ఎంపీపీ ముస్కుల స్రవంతి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, మాజీ ఎంపీటీసీ సిద్ధ్దిరాంరెడ్డి, ఉప సర్పంచ్ శైలజాశివకుమార్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
నిజాంపేట పాఠశాలలో క్రీడా మహోత్సవం
నిజాంపేటలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలను సర్పంచ్ అనూష, ఎంపీటీసీ లహరి, ఎంపీవో రాజేందర్, పీఈటీ రాధిక ప్రారంభించారు. కబడ్డీ, వాలీబాల్, రన్నింగ్ పోటీలు నిర్వహించారు.