మెదక్ అర్బన్/సంగారెడ్డి అర్బన్; ఆగస్టు :7 : జిల్లాలో ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పర్యవేక్షణలో ప్రశాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ఐదు పరీక్షా కేంద్రాల్లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకటి, నర్సాపూర్‌లో మూడు, రామాయంపేటలో ఒక పరీక్ష కేంద్రం నిర్వహించగా, 2342 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 2191 మంది అభ్యర్థులు హాజరైయ్యారు. 151 మంది అభ్యర్థులు గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు. ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష కోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షను మొట్ట మొదటి సారి మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్నందున జిల్లా కేంద్రంలోని ఐదు పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల బయోమెట్రిక్ చేయు సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద నోడల్ అధికారి అదనపు ఎస్పీ బాలస్వామి, మెదక్ డీఎస్పీ సైదులు, తుప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, సంబంధిత సర్కిల్ సీఐలు, ఎస్సైలు, రీజినల్ కో-ఆర్డినేటర్ మెదక్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గణపతి ఆధ్వర్యంలో పరీక్షలు సజావుగా జరిగాయని తెలిపారు. పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి పరిశీలించారు.
మెదక్ జిల్లాలో ఐదు పరీక్షా కేంద్రాలు