మెదక్రూరల్ ఆగస్టు 1: గరుడ పంచమి ప్రతి ఏడాది శ్రావణ శుద్ధ్ద పంచమి రోజున నాగుల పంచమి (గరుడపంచమి) జరుపుకొంటారు భారతీయ సంస్కృతిలో నాగదేవత పూజకు గొప్పవిశిష్టత సంప్రదాయంగా ఆచరణలో ఉన్నది. మనం నిత్యం పూజించే నారాయుణుడి శేష షయునుడి పర్వమే ఈ నాగపంచమి. బ్రహ్మదేవుడు .ఆదిశేషువును అనుగ్రహించిన రోజు.
నాగపంచమి ఏలా చేస్తారు ..
నాగుల పంచమి రోజున ముందుగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటారు. మహిళలు దగ్గర్లో ఉన్న పుట్టవద్దకు వెళ్లి ముగ్గువేసి, పసుపు, కుంకుమ పెట్టి గంధం చిలకరిస్తారు. దీపం వెలిగించి అనంత, వాసుకి, తక్షక ,కర్కోటక, పింగళ ఆ ఐదు నాగదేవతలను మనసులో స్మరించుకొని భక్తిగా నమస్కరిస్తారు.
ఉపవాసం ఎలా చేయాలి ..
పాలు, పండ్లు,నువ్వులు, జొన్న పెలాలు. పంచామృతం, వివిధరకాలైన వాటిని నాగదేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు. మహిళలు నాగపుట్ట వద్దకు వెళ్లి ఆకుతో చేసిన దొప్పలో ఆవుపాలు పోస్తారు. నాగ విగ్రహాలకు మాత్రం శిరస్సుపై నుంచి పోయాలి. పాలు పుట్టలో పోయకూడదు. నాగులపంచమి పూజ చేసేవారు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు. నాగులపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి ఏడాదంతా శుభం కల్గుతుంది.
నాగుల పంచమికి ఏర్పాట్లు పూర్తి
మహిళలు వేకువజాము నుంచే నాగదేవత ఆలయాలతో పాటు పుట్టల వద్దకు వెళ్లి పాలు, గోధుమలతో చేసిన పాయసం నాగదేవతలకు నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కాల సర్ప దోషం ఉన్నవారు ప్రత్యేకంగా నాగపంచమి రోజు పుట్టదగ్గర పాలు పోస్తే సర్పదోష నివారణ కలుగుతుంది. పేరురూలోని గరుడ నాగ పంచమి వేడుకలకు సరస్వతీ ఆలయ ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం.
-దోర్బల రాజమౌళి శర్మ, సరసతీ దేవి ఉపాసకులు