మెదక్ మున్సిపాలిటీ, అగస్టు 3 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపల్ కౌన్సిలర్ జయశ్రీ అన్నారు. హరితహారంలో భాగంగా బుధవారం 8వ వార్డులో రోడ్డుకు ఇరువైపులా స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవళి మనుగడకు చెట్లు మెట్లలాంటివని, వృక్షాలను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత అందరిపై ఉం దన్నారు. మొక్కల పెంపకంతో వాతావరణంలో కాలుష్యం తగ్గి అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. సీఎం కేసీఆర్ సం కల్పానికి అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు దుర్గాప్రసాద్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
మొక్కలను నాటి కాపాడాలి : ఎంపీడీవో ఉమాదేవి
రామాయంపేట, అగస్టు 3 : ప్రతిఒక్కరూ మొక్కలు నాటి, కాపాడాలని ఎంపీపీ భిక్షపతి, ఎంపీడీవో ఉమాదేవి అన్నారు. కోనాపూర్‌లో గ్రామస్తులకు పూలు, పండ్ల మొక్కలను అందజేశారు. రాయిలాపూర్‌లో వైకుంఠధామాన్ని పరిశీలించారు. మొక్కలను నాటి, సంరక్షించాలని కోరారు. మొక్కల పెంపకంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీవో గిరిజారాణి, సర్పంచ్, ఎంపీటీసీలు భాగ్యలక్ష్మి, చంద్రకళ, నర్సాగౌడ్, కార్యదర్శులు చంద్రహాస్, మ హేందర్, నాయకులు ఇమ్మానియేల్, సార్గు భిక్షపతి ఉన్నారు.
పచ్చదనం పెంపొందించాలి :సర్పంచ్ ప్రీతి
నిజాంపేట, అగస్టు 3 : ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని నందిగామ సర్పంచ్ ప్రీతి అన్నారు. గ్రామంలో ఇంటింటికీ 6 మొక్కలు అందజేశారు. ప్రధాన వీధుల్లో గడ్డిమందు పిచికారీ చేయించారు. అవేన్యూ ప్లాంటేషన్ భాగంగా మొక్కలకు ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సురేశ్, కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్, అంగన్వాడీ టీచర్ రామలక్ష్మి ఉన్నారు.
ప్రతి ఒక్కరూ ఆరు మొక్కలు నాటిలి : సర్పంచ్ స్వర్ణలత
చేగుంట, అగస్టు 3 : ప్రతి ఇంటి ఎదుట అరు మొక్కలను నాటాలని చందాయిపేట సర్పంచ్ స్వర్ణలత పేర్కొన్నారు. చందాయిపేటలో మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోశ్‌కుమార్, వార్డు సభ్యు రాలు రమ్య, కార్యదర్శి ఎల్లం, హెచ్ఎం ఊర్మిళ, అంగన్వాడీ టీచర్ ఫరీదా, మహిళలు అరుణ, జ్యోతి ఉన్నారు.
ప్రతి మొక్కనూ సంరక్షించాలి : పీఏసీఎస్ చైర్మన్
శివ్వంపేట, అగస్టు 3 : ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రతీ ఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షించాలని శివ్వంపేట పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకటరాంరెడ్డి అన్నారు. మండలంలోని దంతాన్పల్లి గ్రామంలో ఇంటింటికీ ఆరు మొక్కల ను సర్పంచ్ దుర్గేశ్, ఉపసర్పంచ్నాగేశ్వర్రావుతో కలిసి పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
మొక్కలను సంరక్షించాలి : సర్పంచ్ సవిత
హవేళీఘనపూర్, ఆగస్ట్టు 3 : మండల కేంద్రం హవేళీఘనపూర్‌లో ప్రజలకు మొక్కలను సర్పంచ్ సవిత అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలు ఇంటి ఎదు ట మొక్కలను నాటి, సంరక్షించాలని సూచించారు. మొక్కల పెంపకంతోనే ఆరోగ్యం లభిస్తుందన్నారు. హరితహారంలో ప్రజల భాగస్వాములై మొక్కలను నాటి, పెంచాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు కృష్ణ, శేఖర్ పాల్గొన్నారు.