గ్రామ రెవెన్యూ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. వీఆర్వో వ్యవస్థ రద్దు చేసిన ప్రభుత్వం రెండేండ్లుగా వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల ప్రకారంగా వారిని సర్దుబాటు చేసింది. మెదక్ జిల్లాలో 149 మంది వీఆర్వోలను లాటరీ ప్రక్రియ ద్వారా ఆయా శాఖల్లో సర్దుబాటు చేస్తూ కలెక్టర్ ఎస్.హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. అత్యధికంగా పంచాయతీరాజ్ శాఖలో 50 మందిని కేటాయించగా, ఉన్నత విద్యలోకి 48 మందిని తీసుకున్నారు. రెవెన్యూ శాఖలో ఇద్దరికీ మాత్రమే అవకాశం దక్కింది. వీరంతా విధుల్లో చేరుతున్నారు. – మెదక్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ)
మెదక్, ఆగస్టు3 (నమస్తే తెలంగాణ): గ్రామ రెవెన్యూ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. వీఆర్వో వ్యవస్థ రద్దు చేసిన ప్రభుత్వం రెండేండ్లుగా వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల ప్రకారంగా వారిని సర్దుబాటు చేసింది. మెదక్ జిల్లాలో 149 మంది వీఆర్వోలను ఆయా శాఖల్లో సర్దుబాటు చేస్తూ కలెక్టర్ ఎస్.హరీశ్ ఉత్తర్వులు జారీచేశారు. అత్యధికంగా పంచాయతీ రాజ్ శాఖలో 50 మందిని కేటాయించగా, ఉన్నత విద్యలోకి 48 మందిని తీసుకున్నారు. రెవెన్యూ శాఖలో ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కింది.
జిల్లాలో 149 మందికి పోస్టింగులు
వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే సమయానికి మెదక్ జిల్లాలో 149 మంది వీఆర్వోలు పనిచేస్తున్నారు. వీరిని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించారు. పంచాయతీరాజ్ శాఖలో 50 మంది, ఉన్నత విద్యలో 40 మంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో 17 మంది, రెవెన్యూ శాఖలో ఇద్దరు, వైద్య ఆరోగ్యశాఖలో నలుగురు, వ్యవసాయ, కో ఆపరేటివ్లో ఐదుగురు, పశువైద్య శాఖలో ఇద్దరు, మహిళా- శిశు సంక్షేమ శాఖలో ఇద్దరు, ఇలా ఆయా శాఖల్లో 149 మందిని సర్దుబాటు చేశారు. రెండేండ్లుగా వీఆర్వో వ్యవస్థ రద్దు కావడంతో వారికి వివిధ పనులు అప్పగించారు. వానకాలం, యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రాల వద్ద బాధ్యతలు నిర్వహించారు. కొంతమంది వీఆర్వోలకు మున్సిపాలిటీల్లో వివిధ పనులు అప్పగించారు. రైస్‌మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్పగించే సీఎంఆర్ పర్యవేక్షణ బాధ్యతలు ఇచ్చారు. సుమారు 24 నెలల పాటు వివిధ పనుల్లో ఉన్న వీఆర్వోలను ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల్లో భర్తీ చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆయా శాఖల్లో పోస్టింగ్‌లు ఇచ్చాం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వీఆర్వోలకు జిల్లా లో ఖాళీగా ఉన్న వివిధ శాఖల్లో పోస్టింగ్‌లు ఇ చ్చాం. ఎక్కువగా పంచాయతీరాజ్ శాఖలో 50 మందిని సర్దుబాటు చే శాం. వీఆర్వోల అర్హతలు బట్టి ఆయా శాఖల్లో పోస్టింగ్ లు ఇస్తున్నాం. జిల్లాలో 149 మందిని సర్ధుబాటు చేశాం.
– ఎస్.హరీశ్, మెదక్ కలెక్టర్