అందోల్, జూలై 30: చిరు వ్యాపారులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం జోగిపేటలో పట్టణ ప్రగతి వీధివ్యాపారుల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వ్యాపారులకు ధ్రువ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపారులు తమ అభిరుచికి తగిన రంగాల్లో ముందుకు వెళ్లాలని, ప్రభుత్వ పరంగా సహకారం అందించేందుకు తనవంతుగా కృషి చేస్తానన్నారు. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం దళితబంధు ద్వారా రూ.10 లక్షలు అందజేస్తున్నదని, దీంతో మంది ప్రయోజకులయ్యారని గుర్తుచేశారు.
పట్టణ పరిధిలో కూడా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఆసక్తితో ఉంటే పూర్తి వివరాలతో మెప్మా అధికారులను సంప్రదించాలని, వారు సహకారం అందిస్తారన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా డబ్బులు రూ.2 లక్షల చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. అందోల్, పుల్కల్, చౌటకూర్ మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేసి, కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇండ్లు కూలిపోయిన 31 మంది బాధితులకు ఒక్కొక్కరికీ రూ.3,200 చొప్పున ఆర్థికసాయం చేశారు. కార్యక్రమంలో మెప్మా పీడీ గీత, మున్సిపల్ కమిషనర్ అశ్రిత్‌కుమార్, చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, ఎంపీపీ బాలయ్య, ఇన్చార్జి తహసీల్దార్ అరుణోదయచారి, మాజీ ఎంపీపీ రామాగౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
మిషన్ భగీరథతోనే నీటి సమస్య దూరం
మునిపల్లి, జూలై 30: మిషన్ భగీరథతోనే నీటి సమస్య దూరమైందని అందోల్ ఎమ్మెలే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన మునిపల్లితో పాటు గొర్రెగట్టు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ తాగునీరు అందించి ప్రజలు ఎదురుకొంటున్న సమస్యలకు చెక్ పెట్టారన్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు క్రమం తప్పకుండా అందేవిధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అనంతరం మునిపల్లి ఆదర్శ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మునిపల్లి ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, హాస్టల్ వసతి గృహంలో అదనపు గదులు, రోడ్డు నిర్మాణానికి ప్రత్యేకంగా కృషి చేస్తామన్నారు. అంతకుముందు మునిపల్లిలో మిషన్ భగీరథ ట్యాంకు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
మండల పరిధిలోని గొర్రెగట్టులో సీసీ రోడ్డు పనులు, గ్రామంలో నూతనంగా నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడి సందడి చేశారు. అనంతరం మండలంలోని మునిపల్లి వైస్ ఎంపీపీ బాబాపటేల్ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ శైలజాశివశంకర్, జడ్పీటీసీ మీనాక్షీసాయికుమార్, రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో రమేశ్చంద్ర కులకర్ణి, పార్టీ మండలాధ్యక్షుడు సతీశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి శశికుమార్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు పరశురాంగౌడ్, యువత విభాగం అధ్యక్షుడు ఆనంద్‌రావు, మైనార్టీశాఖ అధ్యక్షుడు మౌలానా, సర్పంచ్‌లు రమేశ్, వీరమణి, విజయభాస్కర్, చిన్నచెల్మెడ ఎంపీటీసీ రాజశేఖర్, టీఆర్ఎస్ నాయకులు శివచంద్రకుమార్ పాటిల్, రాంచందర్‌రావు, విజయ్, చంద్రయ్య, బక్కన్న, మార్కెట్ డైరెక్టర్లు మల్లేశం, గారీబొద్దీన్, శ్రీనివాస్ తదితరులున్నారు.