పాపన్నపేట, జూలై 29 : ప్రతి ప్రభుత్వ పాఠశాలను హరి తవనాలుగా మార్చాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా పాఠశాలలో మొక్క లను నాటి, వాటిని సంరక్షించాలని బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని సూచించారు. శుక్రవారం పాపన్నపేట మండలంలోని బాచారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరాములు, హెచ్ఎం సంతోశ్‌కుమార్, టీచర్లు స్వప్న, మమత ఉన్నారు.
చెట్లతోనే మానవ మనుగడ : ఎస్సై ప్రవీణ్‌రెడ్డి
అల్లాదుర్గం, జూలై 29 : చెట్లతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని ఎస్సై ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. అల్లాదుర్గం మండ లకేంద్రలోని రహదారి వెంట మొక్కలను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొ క్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మొక్కలను నాటి సంరక్షించాలి : సర్పంచ్ ప్రీతి
మొక్కలు నాటి సంరక్షించాలని నందిగామ సర్పంచ్ ప్రీతి అన్నారు. హరితహారంలో భాగంగా స్థానికంగా ఉన్న పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ నూట్రిషన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్ తెలిపారు. గ్రామస్తుల ఆరో గ్యం, పారిశుధ్య పనుల నిర్వాహణ, పోషకాహారం అంశాలను వివరించడమే కమిటీ ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమం లో ఎంపీటీసీ సురేశ్, ఉప సర్పంచ్ రాజం, వార్డు సభ్యులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.
నర్సరీల్లో మొక్కలు సిద్ధ్దం : ఎంపీపీ సబిత
హరితహారం కార్యక్రమానికి కావల్సిన మొక్కలు నర్సరీల్లో సిద్ధ్దంగా ఉన్నాయని నార్సింగి ఎం పీపీ చిందం సబిత, ఎంపీడీవో ఆనంద్‌మేరీ పేర్కొన్నారు. నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలోని నర్సరీని పరిశీలించారు. త్వరలో ప్రారంభించనున్న హరితహారం కార్యక్రమా నికి కావాల్సిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని, మొక్కలు నాటాలన్నారు. వారివెంట ఎంపీవో సతీశ్, టీఆర్ఎస్ నార్సింగి పట్టణాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు.
చందాయిపేటలో వృక్షమిత్ర అభియాన్
వృక్షమిత్ర అభియాన్‌లో భాగంగా చేగుంట మండలం చందాయిపేట మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వర్ణలత, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి, నాటిన ప్రతి మొక్కనూ కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీను, భాగ్యరాజ్, ఉప సర్పంచ్ సంతోశ్‌కుమార్, ఏఎన్ఎం అనురాధ, ఉపాధ్యాయుడు రాజశేఖర్, అంగన్వాడీ టీచర్ ఫరీదా, ఆశ వర్కర్లు అరుణ, లలిత, ఎల్లవ్వ, నర్సవ్వ ఉన్నారు.