మెదక్ రూరల్, జూలై 29 : మెదక్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామపంచాయతీలో క్రీడా ప్రాంగణం పనులు, పారిశుధ్య పనులను శుక్రవారం ఇన్చార్జి ఏపీవో వేణుగోపాల్ రెడ్డి, స్థానిక నాయకుడు మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో వ్యాధులు విస్తరించ కుండా పారిశుధ్య పనులను నిర్వహించాలన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, ఇందులో భా గంగా క్రీడాప్రాంగణాలను నిర్మిస్తున్నట్లు సర్పంచ్ సరోజా మోహన్ అన్నారు. గ్రామాభివృద్ధి ప్రతి ఒక్కరూ సహకరించా లని, వ్యాధులు విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వారివెంట వార్డు సభ్యులు, కార్యదర్శి ఉన్నారు.
నడిమితండాలో స్వచ్ఛత పనులు
మండలంలో స్వచ్ఛత పనులను ము మ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పరిసరాల శు భ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వీధుల్లో చెత్తాచెదారం లేకుండా పనులు చేపట్టారు. నడిమితండాలో స్వచ్ఛతనే ల క్ష్యంగా పనిచేస్తున్నట్లు సర్పంచ్ స్వాతి పేర్కొన్నారు. వీధుల్లోని చెత్తతోపాటు కలుపు మొక్కలను తొలిగించి తరలిస్తున్నారు.
వ్యాధుల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రజలు సీజనల్ వ్యాధుల నివారణ కు జాగ్రత్తలు పాటించాలని, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉం చుకోవాలని గుజిరితండా సర్పంచ్ రాకేశ్‌నాయక్ తెలిపారు. గుజిరితండా, గన్యతండాలో పారిశుధ్య కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు గ్రామాల్లో తిరుగుతూ ఇండ్లలో ఉన్న నిల్వ నీటిని పారబోశారు. ఇంటితోపాటు పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. చెత్త సేకరణకు ప్రత్యక్షంగా చూపించారు. తండాల్లోని నీటికాల్వలో దోమల నివారణకు ఆయిల్‌బాల్స్ వేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రాకేశ్‌నాయక్, శంకర్‌నాయక్, పంచాయతీ కార్యదర్శులు నాగరాజు, నిర్మల, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలకు అవగాహన
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో ఉమాదేవి పేర్కొన్నారు. మండలంలోని డీ.ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలతో సమావేశమై సీజనల్ వ్యాధుల నివా రణ చర్యలపై అవగాహన కల్పించారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు గ్రామంలో ఉంటూ ప్రజల ఆరోగ్య పరిస్థితిని చేసుకోవా లని సూచించారు. అవసరమైతే ఇంటింటి ఆరోగ్య సర్వే చేప ట్టాలన్నారు. మురుగునీరు, ఇండ్లలో ఉన్న నిల్వ నీటితోనే వ్యా ధులు వస్తాయన్నారు. దోమల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వైద్య సిబ్బంది, పీహెచ్ఎన్ ఎంలు సత్తమ్మ, శ్యామల, ఏఎన్ఎంలు తదితరులు ఉన్నారు.