రామాయంపేట/ కొల్చారం/ మెదక్ మున్సిపాలిటీ/ శివ్వంపేట/ చిలిపిచెడ్/ చేగుంట, జూలై 26 : రామాయంపేట పట్టణంలోని ఏడీదుల ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా జరి గాయి. మంగళవారం పట్టణంలో బోనాల ఊరేగింపు కన్నుల పండు వగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దంపతులు అమ్మవారిరి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఏడీదుల ఎల్లమ్మ కాలనీకి చెందిన మహిళలు అమ్మవారికి బానాలు, మంగళహారతులు, నైవేధ్యాలను సమర్పించారు.
అప్పాజిపల్లిలో బోనాల ఊరేగింపు
కొల్చారం మండలంలోని అప్పాజిపల్లిలో బోనాల ఊరేగిం పు భక్తిశ్రద్ధలతో సాగింది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల శిగాల మధ్య బోనాలను ఊరేగిస్తూ గ్రామ దేవతల ఆలయాల వరకు తీసుకెళ్లారు. ఉత్సవాల్లో సర్పంచ్ ఝాన్సీలక్ష్మీయాదగిరి, మాజీ సర్పంచ్ సునీతావెంకట్గౌడ్, వార్డు సభ్యులు ధన్‌రాజ్, చింతల కిషన్, వీరేశం, శ్రీనివాస్, నర్సింహులు, చంద్రశేఖర్‌తో పాటు పాండరి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు
జిల్లా కేంద్రం మెదక్‌లో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. పట్టణంలోని రాందాస్ చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా ఆటోగర్లోని నల్ల పోచమ్మ ఆలయం వరకు బోనాల ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊత్సవాల్లో ఆరె కటికె సంఘం నాయకులు గోవింద్, మధు, శ్రీనివాస్, నారాయణ, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
నార్సింగి మండలకేంద్రంతోపాటు, చేగుంట మండలంలోని చందాయిపేటలో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు.
శాకాంబరిగా రేణుకాంబ అమ్మవారి అలకంరణ
జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలోని పసుపులేరు ఒడ్డున ఉన్న రేణుకాంబ భక్తులకు శాకాంబరి మాతగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆర్చకులు వేదవ్యాసు, శ్రీనివాస్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శాకాంబరి మాతకు నైవేధ్యాలు సమర్పించిచ, మొక్కులు తీర్చుకున్నారు.
చాకరిమెట్లలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రత్యేక పూజలు
శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్లలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సహకార ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయశర్మ ఆధ్వర్యం లో ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీని సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సత్యనారాయణస్వామి వ్రత మండపాన్ని సందర్శించి ఆలయ విశిష్ఠను తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అర్చకులు దేవదత్తుశర్మ, దేవీప్రసాద్, ఆలయ సిబ్బంది నర్సింహారెడ్డి, రామకృష్ణ, శ్రీనివాస్ ఉన్నారు.
పంచలోహ విగ్రహాల ఏర్పాటుకు విరాళం
చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామ శివారులోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి పంచలోహ విగ్రహాల ఏర్పాటుకు గ్రామస్తులు విరాళం అందజేశారు. రూ.51 వేల నగదును చిట్కుల్ గ్రామానికి చెందిన తార విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి అంజిరెడ్డి జ్ఞాపకార్థం విరాళాన్ని అర్చకుడు గిరిధారచర్యులకు అందజేశారు. అంజిరెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో పేదకుటుంబాలకు తనవంతుగా చేయూతనిస్తానని తెలిపారు.