అల్లాదుర్గం, జూలై 26 : ప్రఖ్యాతిగాంచిన శ్రీరేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని దేవాదాయశాఖలో విలీనం చేయాలని కోరుతూ అల్లాదుర్గం మండలకేంద్రంలో స్థానికులు, భక్తులు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జేఏసీ జెం డాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడు తూ.. అమ్మవారి దేవాలయానికి రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారన్నారు. లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నా, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ఆలయానికి వస్తున్న ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, పారిశుధ్య పనులు నిర్వహించకుండా భక్తులకు ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు.
ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేసేందుకు అధికారులు, ప్రతిపాదనలు రూపొందించారని తెలిపారు. దీన్ని అడ్డుకోవడానికి ఆలయ పూజారులు తమ పలుకుబడితో ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తి డి తెస్తున్నారని ఆరోపించారు. వారం రోజుల క్రితం స్థానికులు, భక్తు లు ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయాలని కోరుతూ ఈ నెల 20న సంగారెడ్డిలో అధికారులకు విన్నవించారు. దేవాదాయ శాఖ లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పూజారులు కోర్టును ఆశ్రయించినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో స్థానికులు, కులసంఘాలు, ప్రజాప్రతినిధులు మంగళవారం స్థానిక వేంకటేశ్వర దేవాలయంలో సమావేశమయ్యారు. రేణుకాఎల్లమ్మ ఆలయాన్ని దేవాదాయశాఖలో విలీనం చేసేంత వరకు ఉద్యమించాలని తీర్మానించారు. కార్యక్రమం లో జేఏసీ కమిటీ అధ్యక్షుడు అంజియాదవ్, ఉపాధ్యక్షుడు బ్రహ్మం, నేతలు సూర్యకుమార్, దశరథ్, శ్రీశైలం, రవి, ప్రవీణ్ ఉన్నారు.