మెదక్ మున్సిపాలిటీ/ రామాయంపేట, జూలై 26 : కార్మిక చ ట్టాలను సవరించి, కనీస వేతనాలు అమలు చేయాలని కేంద్ర ప్ర భుత్వాన్ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నర్సమ్మ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేయడానికి వెళ్లగా.. ఎవరూ లేకపోడంతో కార్యాలయ ప్రధాన డోర్‌కు వినతిపత్రాన్ని అతికించారు. ఈ సందర్భంగా నర్సమ్మ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత 73 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చిందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ఒక్కోక్కటిగా రద్దు చేస్తున్నట్లు విమర్శించారు. రోజూ 12 గంటలు పని చేస్తున్నా కనీస వేతనంగా నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, వలస వచ్చిన కార్మికుల తో యాజమాన్యాలు ఎక్కువ గంటలు వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో 16 లక్షల మంది కార్మికులు ఉన్నారని, వీరికి జీవో 25 గెజిట్ ఏర్పాట చేయాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట నాయకులు ఏసు, పెంటేశ్, అనిల్ ఉన్నారు.
పని కల్పించాలి : సీఐటీయూ నాయకురాలు బాలమణి
బీడీలు చుట్టే కార్మికులకు నెలకు సరిపడా పని రోజులు కల్పించాలని సీఐటీయూ నాయకురాలు బాలమణి పేర్కొన్నారు. రామాయంపేటలోని లేబర్ కార్యాలయం గోడకు వినతిపత్రం అతికించారు. బీడీ కార్మికులకు పదిరోజులు మాత్రమే పని లభిస్తుందని, నెలకు 25 రోజుల పాటు పని కల్పించాలన్నారు. అర్హులైన బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలని సీఐటీయూ నాయకులు కోరారు.