మెదక్ మున్సిపాలిటీ, జూలై 26 : వానకాలంలో సీజనల్ వ్యా ధులు సంక్రమించకుండా.. ఈగలు, దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, ఆశ వర్కర్లు, మెప్మా సిబ్బంది, వైద్యఆరోగ్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా, అతిసార వ్యాధులు ప్రబలకుండా ఆశ వర్క ర్లు, వైద్యారోగ్య సిబ్బంది పట్టణ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పట్టణం లో హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి ముం దస్తు చర్యలు తీసుకోవాలని సూచించా రు. వేడి ఆహార దార్థాలను తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీటినే తాగాలని ప్రజలకు అవగాహ కల్పించాలన్నారు. ఇంటి తోపాటు పరిసరాల్లో నీటి నిల్వలను తొలి గించాలన్నారు. ప్రతి వార్డులో స్ప్రే, ఫాగింగ్, కుంటల్లో ఆయిల్ బాల్స్ వేయడం, బ్లీచింగ్ పౌడర్ వెదజల్లే కార్యక్రమాలతోపాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఆదివారం డ్రై డే పాటించాలన్నారు. సమావేశంలో బస్తీ దవాఖాన వైద్యుడు మణికంఠ, శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, ఆరోగ్య సిబ్బంది పవన్, శానిటరీ జవాన్లు కిషన్, శ్రీనివాస్, శ్యాంసుందర్ పాల్గొన్నారు.