మెదక్ మున్సిపాలిటీ/ రామాయంపేట/ పెద్దశంకరంపేట/ రామాయంపేట/ నర్సాపూర్/ టేక్మాల్/ చేగుంట, జూలై 22 : ఆషాఢ మాసం పురస్కరించుకొని జిల్లా కేంద్రం మెదక్‌లోని కాళీమాత ఆలయంలో విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మహా చండీయాగం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు. ఈ సందర్బంగా కాళీమాతను కూరగాయలు, పండ్లతో అందంగా అలంకరించారు. పూజా కార్యక్రమాల్లో స్వర్ణకార సంఘం నాయకులు పాల్గొన్నారు.
మహంకాళి అమ్మవారికి అభిషేకాలు
రామాయంపేట పట్టణంలోని మహంకాళి ఆలయ వార్షికో త్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ పాండురంగాచారి, వరలక్ష్మి దంపతులు అభిషేకాలు, ప్ర త్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి మంగళ హారతులు, నైవేథ్యాలు, అభిషేకాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది శ్యాంరాజ్, సత్యం, యాదగిరి, సుంకోజు దామోదర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మంజీరా విద్యాలయంలో బోనాలు
రామాయంపేటలోని మంజీరా విద్యాలయంలో బోనాల పండుగ నిర్వహించారు. ఉపాధ్యాయులు బోనాలను తయారు చేసి విద్యార్థులకు బోనాలెత్తారు. శివసత్తుల వేషధారణలో విద్యార్థులు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ వాసవి, కరస్పాండెంట్ జితేందర్‌రెడ్డి, టీచర్లు సురేశ్, మౌనిక, సుధాకర్, శిరీష, మీనా, సంధ్య పాల్గొన్నారు.
వైభవంగా కోటమ్మ ఉత్సవాలు ప్రారంభం
పెద్దశంకరంపేట మండలంలోని భూర్గుపల్లి గ్రామంలో కోట మ్మ ఉత్సవాలు నిర్వహించారు. కోటమ్మ అమ్మవారికి మాజీ సర్పంచ్ కరణం బాలసరస్వతీసత్యనారాయణ దంపతులు మ కర తోరణాన్ని ఏర్పాటు చేయించారు. సర్పంచ్ సరితామల్లేశం ఆధ్వర్యంలో చండీహోమం నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 24న సాయంత్ర కోటమ్మ అమ్మవారికి బోనా లు సమర్పిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పెర్మాల్గౌడ్, ఉపేందర్, కోటయ్య, ఆర్కె రాజు, గంగారాం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్, టేక్మాల్‌లో ఆదివారం బోనాలు
నర్సాపూర్ మున్సిపల్లో ఆదివారం బోనాలు నిర్వహిస్తు న్నట్లు మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి తెలి పారు. ఈ నెల 24న ముత్యాలమ్మ ఆలయం వద్ద, 25న నల్లపోచమ్మ, దుర్గ మ్మ, భూలక్ష్మమ్మ ఆలయాల్లో బండ్ల ఊరేగింపు, బోనాలు, ఫలహారాల బండ్ల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
టేక్మాల్ గ్రామంలో ఆదివారం మహంకాళి బోనాలు నిర్వ హిస్తున్నట్లు సర్పంచ్ సుప్రజాభాస్కర్ తెలిపారు.
సోలీపేట సుజాతకు ఆలయ కమిటీ ఆహ్వానం
చేగుంట పట్టణంలో ఆదివారం నిర్వహిస్తున్న మహంకాళి ఆలయ ఉత్సవాలకు హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత, తనయుడు సతీశ్‌రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. సిద్దిపేటలో సోలిపేట కుటుంబీకులను నాయకులు డిష్ రాజు, తీగుళ్ల్ల ఆంజనేయులు, సతీశ్, రాజేశ్ తదితరులు కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు.