అమీన్పూర్, జూలై 19: టీఆర్ఎస్ సర్కార్ పేదలకు అందుబాటులో ఉండేలా, సుస్తీ పోగొట్టే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ బస్తీలో, లింగమయ్య కాలనీలో, బందంకొమ్ము గ్రామంలో 3 బస్తీ దవాఖానలను మంత్రి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో నగేశ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీపీ దేవానంద్, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ నందారం నర్సింహ్మగౌడ్, స్థానిక కౌన్సిలర్లు ఎడ్ల రమేశ్, మల్లేశ్, బీజీలి రాజు, బాశెట్టి కృష్ణ, కొల్లూరి మల్లేశ్, యూసూఫ్, కల్పన, ఉపేందర్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యులు రాములు, యూనూస్, స్వరూప, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బాల్‌రెడ్డి, చంద్రశేఖర్, దాస్ యాదవ్, జగదీశ్, ప్రమోద్‌రెడ్డి, దండు జ్ఞానేశ్వర్, తుమ్మల ప్రభాకర్‌రెడ్డి, నాయకుడు రుశ్వంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైద్య సేవలకు వందకు వంద మార్కులు వేస్తా:మంత్రితో ఓ మహిళ
ఈ సందర్భంలో లక్ష్మి అనే మహిళను డాక్టర్ల, సిబ్బంది సేవలకు ఎన్ని మార్కులు వేస్తావని మంత్రి ప్రశ్నించారు. ఆమె సార్.. నేను పెద్దగా చదువుకోలేదు. నాది మహబూబ్‌నగర్ జిల్లా, నా కూతుర్లు, నా మనవరాళ్లు కూడా ఇక్కడే కాన్పులు చేయించుకున్నారు. ఇప్పుడు నాకు మనవరాలు పుట్టిందని తెలిపింది. డాక్టర్లకు వందకు వంద మార్కులు వేస్తానని చెప్పడంతోపాటు కేసీఆర్ కిట్ ఇవ్వడంపై, సీఎం కేసీఆర్ స్కీంలను ఆమె కొనియాడింది. తన బిడ్డ పెండ్లి సమయంలో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి అందుకున్నదని సంతోషంగా చెప్పింది. ఆమె మాటలకు మంత్రి హరీశ్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి తక్షణం కేసీఆర్ కిట్‌ను తెప్పించి అందజేశారు.
పీడియాట్రిక్ కేర్ యూనిట్ ప్రారంభించిన మంత్రి
సంగారెడ్డి జిల్లా దవాఖానలో డెడికేటెడ్ పీడియాట్రిక్ కేర్ యూనిట్‌ను మంత్రి ప్రారంచారు. చిన్నారుల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. అనంతరం దవాఖానలోని పలు వార్డుల్లో మంత్రి కలియతిరుగుతూ రోగులతో ముచ్చటించారు. వైద్యులు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్పర్సన్ లతావిజయేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పట్నం మాణిక్యం, మనోహర్‌గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.