నర్సాపూర్, జూలై19: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ పేర్కొన్నారు. నర్సాపూర్ పట్టణంలో మంగళవారం మెదక్ జిల్లా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ 10వ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి కార్మిక చట్టాలను సాధించుకుంటే 44కార్మిక చట్టాలను 4 కోర్డులుగా నిర్ణయించారన్నారు. ఈ కోర్డుల ద్వారా కార్మికులకు కనీసవేతనాలు అడిగే హక్కు, ఉద్యోగ భద్ర త హక్కులను ఉండకుండా చూస్తున్నారని ధ్వజమెత్తారు.
జిల్లా నూతన కమిటీ ఎన్నిక
ఈ మహాసభలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నర్సాపూర్‌కు చెందిన పుష్పా, ప్రధాన కార్యదర్శిగా మెదక్‌కు చెంది న నాగరాజు, కోశాధికారిగా రామాయంపేటకు చెం దిన ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా మల్లయ్య, శ్రీకాంత్, అనిత సహాయ కార్యదర్శిగా అశోక్, భాగయ్యలను ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నర్సమ్మ, మున్సిపల్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బస్వరాజు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు పాల్గొన్నారు.