మిరుదొడ్డి, జూలై 17: పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారని మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్ది అన్నారు. మండలంలోని అక్బర్‌పేటలో సైబర్ హబ్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం రుద్రారం గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్‌తో నివాస గుడిసె కాలిపోయిన బాధితుడు ఊస స్వామిని పరామర్శించి రూ.5 వేలు నగదును అందజేశారు. రుద్రారం మీదుగా మోతె గ్రామానికి వెళ్లడానికి కూడవెల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రోడ్డును పరిశీలించారు. రుద్రారంలో ఇదారి రాజవ్వ సాగుచేస్తున్న ఆయిల్‌పామ్ తోటను పరిశీలించి, పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మిరుదొడ్డిలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహంకాళి బోనాల ఉత్సవాలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి దయతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని పేర్కొన్నారు. రైతులు రైతుబంధు డబ్బులతో సంతోషంగా పంటలు పండించుకోవాలని కోరారు. ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు, పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తుమ్మల బాల్‌రాజు, ఏఎంసీ చైర్మన్ వల్లాల సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు సూకురి లింగం, సర్పంచ్ కాలేరు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ భాస్కరాచారి, జిల్లా గ్రంథాల బోర్డు డైరెక్టర్ బోయ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, నాయకులు భూపతిగౌడ్, కమలాకర్‌రెడ్డి, రాజు, దుబ రాజం, ప్రభాకర్, శ్రీనివాస్ మురళి, ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.