ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు
సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్‌లు
అక్టోబర్ 1నుంచి తరగతులు ప్రారంభం
మెదక్ (నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 17;దోస్త్ ద్వారా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం విద్యార్థుల ముందు ఉంచింది. ఇందుకోసం విద్యార్థులు ముందుగానే తమ ఆధార్‌కు ఫోన్ నంబర్ లింక్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. టీ-యాప్ ద్వారా https://dost.cgg.gov.in విద్యార్థులు లాగిన్ కాగానే వారికి దోస్త్ ఐడీ, పిన్ నంబరు వస్తుంది. వీటిని ఉపయోగించి దరఖాస్తు పూర్తి చేసుకోవాలి. కోరుకున్న కళాశాలలో సీటు వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఏ దశ కౌన్సెలింగ్‌లో అయినా సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా ఎంపిక చేసుకున్న కాలేజీకి వెళ్లి ధ్రువీకరణ పత్రాలు సమర్పించి,ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
తొమ్మిది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో తొమ్మిది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అధ్యాపకులు నాణ్యమైన బోధనను అందిస్తూ విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వికసిస్తున్నాయి. దీంతో ప్రతి ఏడాది ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదివేందుకు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. మెదక్ జిల్లాలో రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 1320 సీట్లు ఉండగా, మెదక్ 1020, నర్సాపూర్ కళాశాలలో 300 సీట్లు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 7 ప్రభుత్వ కాలేజీలు ఉండగా, 4200 సీట్లు ఉన్నాయి. తారా కళాశాల1620, పటాన్చెరు 720, జోగిపేట 360, జహీరాబాద్ 480, సదాశివపేట 420, సంగారెడ్డి మహిళా కళాశాల 300, నారాయణఖేడ్‌లో 300 సీట్లకు నోటిఫికేషన్ విడుదలైంది
సేవా కేంద్రం ద్వారా ఉచిత సేవలు
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని ఆయా యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో దోస్త్ సేవా కేంద్రాలు కళాశాల ప్రిన్సిపాళ్ల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. కేంద్రాల్లో విద్యార్థులు ఆధార్‌తో పాటు ఫారం కోసం రూ.200 చెల్లిస్తే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లో ఉన్న అధ్యాపకులు రిజిస్ట్రేషన్‌తో పాటు, వెబ్ ఆప్షన్లు సైతం పెడుతారు. దీంతో విద్యార్థులు నచ్చిన కళాశాల ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలో తప్పలు జరిగితే ఈ కేంద్రా ల ద్వారా సరిదిద్దుకునే అవకాశం కల్పించారు.
విద్యార్థుల ఉపయోగార్థం హెల్ప్‌డెస్క్
దోస్త్ ఆన్లైన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలో భాగంగా ఆయా కళాశాల ప్రిన్సిపాళ్లు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ వారికి సహకరిస్తున్నారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సహాయార్థం సెల్ నంబర్: 9059058286, నర్సాపూర్ డిగ్రీ
కళాశాలలో సెల్: 9492208899, సంగారెడ్డి విద్యార్థులు 7989239115 నంబర్లలో సంప్రదించవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం..
దోస్త్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉన్నది. దోస్త్ లాగిన్‌తో ఆన్లైన్ ఫాం నింపే క్ర మంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వివరాలను చూసుకుని వారికి నచ్చిన, అందుబాటులో ఉండే యూనివర్సిటీలో వాటికి అనుసంధానంగా ఉన్న కాలేజీలో ప్రవేశం పొందవచ్చు.
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య..
ప్రభుత్వ కళాశాలల్లో అన్ని మౌలిక వసతులను కల్పించినందున విద్యార్థులు తమ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశం పొందాలి. తెలంగాణ ఏర్పడిన తరువాత అనేక కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన అధ్యాపకులను కూడా అధికారులు నియమించారు. తమకు ఇష్టమైన, అనువైన కోర్సులను ఎంచుకోవచ్చు. తారా కళాశాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి. కంప్యూటర్ హార్డ్‌వేర్, డప్పు వాయిద్యం వంటి సర్టిఫికెట్ కోర్సులను కూడా అందిస్తున్నాం. ఆధునిక కంప్యూటర్ ల్యాబొరేటరీలు, లైబ్రరీ, క్రీడామైదానం, జిమ్ అందుబాటులో ఉన్నాయి. దోస్త్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
–ప్రవీణ, జిల్లా ఐడీ కళాశాల, తారా కళాశాల ప్రిన్సిపాల్, సంగారెడ్డి
ముఖ్యమైన తేదీలు..
తొలి దశ రిజిస్ట్రేషన్: జూలై 1 నుంచి 30 వరకు
వెబ్ ఆప్షన్ల నమోదు: జూలై 6 నుంచి 30
ధ్రువపత్రాల పరిశీలన: జూలై 28, 29
సీట్ల కేటాయింపు : ఆగస్టు 6
సెల్ఫ్ రిపోర్టింగ్: ఆగస్టు 8 నుంచి 18 వరకు
రెండో దశ రిజిస్ట్రేషన్: ఆగస్టు 7 నుంచి 21 (రూ.400తో)
వెబ్ ఆప్షన్ల నమోదు: ఆగస్టు 7 నుంచి 22
సీట్ల కేటాయింపు: ఆగస్టు 27
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ దాకా
మూడో దశ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల నమోదు: ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు
సీట్ల కేటాయింపు: సెప్టెంబర్ 16
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 22 వరకు
ఓరియెంటేషన్: సెప్టెంబర్ 23 నుంచి 30 దాకా
అక్టోబర్ 1 నుంచి తరగతులు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..