నర్సాపూర్/ మెదక్ రూరల్/ నిజాంపేట, జూలై 17 : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అమ్మవారి ఆల యాలు భక్తులతో కిటకిటలాయి. ఆషాఢ మాసం సందర్భంగా ఆయా గ్రామాల్లో అమ్మవార్లకు గ్రామ స్తులు బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకుం టున్నారు. నర్సాపూర్ పట్టణంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ పరమేశ్వరీ ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. నర్సాపూర్‌లోని రాయారావు చెరువుకట్టపై రేణుకాఎల్లమ్మ పరమేశ్వరికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గణపతి హోమం, అగ్నిహోత్ర, పూర్ణాహుతి, బోనాల ఊరేగింపు జరిగాయి. ఉత్సవాల్లో వేదపండితుడు హరిప్రసాద్‌శర్మ పాల్గొన్నారు.
రేణుకామాతకు పట్నాల పూజలు
మెదక్ మండలం మంబోజిపల్లిలోని కొయ్యగుట్టపై ఉన్న మల్లికార్జునస్వామి అలయంలో పూజారి మల్లన్న ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి పట్నం వేసి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు మంగళహారుతులతో ఒడి బియ్యం సమర్పించారు.
ఊరడమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
నిజాంపేట మండలంలోని చల్మెడలో గ్రామస్తులు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. ఊరడమ్మ ఆలయంలో అమ్మవారిని జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్ దర్శించుకొని ప్ర టత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ రమేశ్, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్, గ్రామస్తులు ఉన్నారు.
ఆలయ అభివృద్ధికి దాతల సహకారం
నిజాంపేట మండలకేంద్రంలోని రేణుకాఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి దాతలు సహకరిస్తున్నారని రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్ వెంకటేశం, నిజాంపేట మాజీ సర్పంచ్ తిరుమల్‌గౌడ్ అన్నారు. ఆల యాల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరా రు. ఆలయంలో బీఆర్ కన్స్ట్రక్షన్ ప్రతినిధులు రూ. 3.50లక్షల వ్యయంతో రెండు గదులు నిర్మించారు. ఈ మేరకు బీఆర్ కన్స్ట్రక్షన్ ప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు స్వామిగౌడ్, అబ్దుల్ అజీజ్, నందిగామ మాజీ సర్పంచ్ సంగుస్వామి, వార్డు సభ్యుడు తిరుమల్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు రంజిత్, రాజుగౌడ్ ఉన్నారు.