వెల్దుర్తి/ పెద్దశంకరంపేట/ మనోహరాబాద్, జూలై 17 : మసాయిపేట మండల పరిధిలోని ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మాసాయిపేట సర్పంచ్ మధుసూదన్‌రెడ్డికి ఆదివారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అందజేశారు. మాసాయిపేటకు చెందిన శంకర్‌కు రూ.43 వేలు, చెట్లతిమ్మాయిపల్లికి చెందిన శోభకు రూ.20 వేలు వైద్యఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి మంజూరు కాగా, చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దశంకరం పేట మండలానికి చెందిన ఇద్దరు లబ్ధ్దిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను అందజేశారు. ఉత్తులూరు గ్రామానికి చెందిన మీర్సాబ్కు రూ.14వేలు, నాగమ్మకు రూ.5 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతు లు, సర్పంచ్ పార్వతీశంకర్గౌడ్ పాల్గొన్నారు.
పేదలకు సీఎంఆర్ఎఫ్ అండ : ఎలక్షన్‌రెడ్డి
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి అన్నారు. తూప్రాన్, మనోహరాబాద్ మండలాలకు చెందిన ముగ్గురికి మొత్తం రూ. 1.54లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారన్నారు. తూప్రాన్‌కు చెందిన మల్లేశ్‌కు రూ.60వేలు, పద్మకు రూ. 34వేలు, రామాయిపల్లికి చెం దిన సీహెచ్ ప్రభాకర్‌కు రూ.60వేలు మంజూరయ్యాయి. కార్యక్రమంలో నాయకులు యాసిన్, నవీన్ పాల్గొన్నారు.