రాయపోల్/దౌల్తాబాద్, జూలై 17 : వానకాలం దృష్ట్యా విద్యుత్ సరఫరాల్లో తరుచూ సమస్యలు తలెత్తుతున్నాయని, అధికారులు సమస్యాత్మకంగా ఉన్న వాటిని గుర్తించి వెంటనే పరిష్కరించాలని మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎంపీ కార్యాలయంలో దౌల్తాబాద్, రాయపోల్ మండలాల ప్రజాప్రతినిధులు, విద్యు త్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు రైతులకు అందుబాటులో ఉం డాలన్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గం టలు విద్యుత్ సరఫరా చేస్తుందన్నారు. వానకాలం నేపథ్యంలో ట్రాన్స్‌కో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ఉమ్మడి మం డల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్‌గుప్తా, దౌల్తాబాద్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్, వైస్ ఎంపీపీ శేఖర్‌రెడ్డి, నాయకులు జనార్దన్‌రెడ్డి, ఉప్పర్‌పల్లి స ర్పంచ్ చిత్తరి గౌడ్, ఉమ్మడి మండల సొసైటీ వైస్ చైర్మన్ పాల రవీందర్‌గౌడ్, నాయకులు మోహన్‌రావు, దయాకర్, రాంచంద్రంగౌడ్ పాల్గొన్నారు.
ఏఎంసీ చైర్మన్‌కు శుభాకాంక్షలు
మండలంలోని రాంసాగర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి మం డల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్‌గుప్తా పుట్టిన రోజు శనివారం కావడంతో ఆయనకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.