సిద్దిపేట, జూలై 17 : పట్టణంలో వివిధ కార్యాలయాల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలకు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. శనివారం అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్తో కలిసి ఎంపీడీవో, జిల్లా పరిషత్ కార్యాలయాలను పరిశీలించారు. ప్రస్తుత భవనాల స్థానాల్లో నూతనంగా వెజ్, నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు వీలుగా జిల్లా పరిషత్ కార్యాలయ ఏర్పాటుకు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్, సిద్దిపేట రూరల్ ఎంపీడీవో కార్యాలయ ఏర్పాటుకు జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ కార్యాలయాలను పరిశీలించారు. సిద్దిపేట రూరల్ తాసీల్ కార్యాలయ ఏర్పాటుకు మున్సిపల్ పబ్లిక్ హెల్త్ భవనం, అర్బన్ ఎంపీడీవో కార్యాలయం ఏర్పాటుకు ప్రాంతీయ పశువైద్యశాల భవనం, వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం, జిల్లా కోర్టు ఏర్పాటుకు మిట్టపల్లి గ్రామ సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా నూతన కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన చర్యలను చేపట్టాలని ఆర్ అం డ్బీ, మున్సిపల్, పంచాయతీరాజ్, పశుసంవర్థక, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి, పశుసంవర్థక అధికారి శివప్రసాద్, ఆర్అండ్బీ ఏఈ మల్లేశం, డీఈవో రవికాంతారావు తదితరులు ఉన్నారు.