మద్దూరు (ధూళిమిట్ట), జూలై 16 : దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, టీఆర్ఎస్ జోలికొస్తే గుణపాఠం తప్పదని టీఆర్ఎస్ ధూళిమిట్ట యూత్ మండల అధ్యక్షుడు బడుగు సాయిలు హెచ్చరించారు. శనివారం మద్దూరు మండల కేంద్రంలో తాజ్‌మహల్ గార్డెన్లో మద్దూరు, ధూళిమిట్ట మండలాల టీఆర్ఎస్ యూత్, విద్యార్థి విభాగం నాయకులు, సోషల్ మీడియా వారియర్స్‌తో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం నర్సాయపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ పిల్లలను బీజేపీలో చేర్చుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారని తెలిపారు. ఈ క్రమంలో రెండురోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు గ్రామ సమస్య గురించి మాట్లాడుతూ నోరుజారడని చెప్పి గ్రామ పెద్దలు అతడిపై చేయిచేసుకున్నారని తెలిపారు. అయితే ఆ యువకుడిని టీఆర్ఎస్ నాయకులే కొట్టారని చెప్పి బీజేపీ నాయకుడు బొంగోని సురేశ్ ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో విషప్రచారం చేశాడని విమర్శించారు. దమ్ముంటే దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సురేశ్ బీజేపీ నాయకుడు ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి తన స్వగ్రామంలో ఎంతోమంది యువకుల వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు విమర్శించారు. అభివృద్ధిపై బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. పసుపు బోర్డు తెస్తానని హామీనిచ్చి గద్దెనెక్కిన నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కు రైతులు చెప్పుల దండలతో స్వాగతం పలుకుతున్నా బీజేపీ నాయకులకు బుద్ధిరావడం లేదని హెద్దేవా చేశారు.
టీఆర్ఎస్లో చేరిన యువకులు..
నర్సాయపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన యువకులకు సాయిలు గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు. సమావేశంలో టీఆర్ఎస్ యూత్ మద్దూరు మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు రవి, శ్రీకాంత్, సోషల్ మీడియా మం డల కన్వీనర్లు కిరణ్, సాయి, రఘు, నాయకులు అశోక్, సుమన్, గణేశ్, శివ, రవికుమార్, లింగం పాల్గొన్నారు.