పటాన్చెరు/పటాన్చెరు టౌన్, జూలై 16: అభివృద్ధి వెలుగుల్లో ‘మినీ ఇండియా పటాన్చెరు’ వెలిగిపోతున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివిధ శాఖల అధికారులతో శాఖ పనితీరుపై, చేయాల్సిన పనులపై ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎనిమిదేండ్లుగా ఎమ్మెల్యేగా తాను పటాన్చెరు నియోజకవర్గంలో వేలాది కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేశానన్నారు. మంత్రుల సహకారం ఉండడంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. జీహెచ్ఎంసీలోని మూడు డివిజన్లు, మూడు మున్సిపాలిటీలతో పాటు 55 గ్రామ పంచాయతీలు అభివృద్ధికి మారుపేరులా మారాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించడంతో పనులు చకచకా చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులతో పాటు పలు కార్యక్రమాలకు పరిశ్రమల సీఎస్సార్ నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. సొంత నిధులు సైతం ఖర్చు చేసి ప్రజా అవసరాలను తీరుస్తున్నామని చెప్పారు. ఇటీవల సీఎం కేసీఆర్ మున్సిపాలిటీలకు ప్రకటించిన రూ.25 కోట్లతో మూడు మున్సిపాలిటీల్లో రూ.75 కోట్ల అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. వాటితో పాటు ప్రతి పంచాయతీకి రూ.20 లక్షలతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. దాదాపు 55 పంచాయతీల్లో పనులు చేస్తామన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నాణ్యమై, శాశ్వత ప్రాతిపాదికన నూతన భవనాలను నిర్మిస్తున్నామన్నారు. మౌలికవసతుల కల్పనకు కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీల అవసరాలకు జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 పంచాయతీలకు ట్రాక్టర్లు ఇచ్చామని గుర్తు చేశారు.
గంగా జమున తెహజీబ్‌కు పటాన్చెరు నియోజకవర్గం నిదర్శనమని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. సొంత నిధులతో ఎన్నో దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ఈద్గాలను నిర్మించామన్నారు. ప్రజలు సేవ చేసే అవకాశం ఇచ్చారని వారికి సేవ చేస్తున్నానమన్నారు. మినీ ఇండియాలో దేశంలోని 28 రాష్ర్టాల ప్రజలు నివసిస్తున్నారని, ఎన్నో రకాల వైవిధ్యాలు ఉన్న వారందరినీ కలిపి ఉంచుతూ, వారిని సంక్షేమ పథకాల్లో భాగస్వాములను చేస్తున్నామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద నష్టం సంభవించకుండా అధికారులతో కలిసి తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన వారికి రూ.16 లక్షల సొంత సాయం అందజేశామని, పశువులు మరణించిన చోట కూడా సాయం అందించామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అధికారుల సహకారంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. సొంత నిధులతో 32వేల మంది విద్యార్థులకు 2 లక్షల 30వేల నోట్‌బుక్‌లను అందజేశామన్నారు. అంగన్వాడీ విద్యార్థులకు తెలుగు వర్ణమాల పలుకలు అందిస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్ వద్ద రూ.140 కోట్ల ప్రతిపాదనలు ఉంచామని, దానికి త్వరలోనే అనుమతులు, నిధులు వస్తాయన్నారు. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, సంక్షేమ రంగాలు అన్నింట్లోనూ పటాన్చెరు ముందుంచడమే తన లక్ష్యం అన్నారు.
– జోనల్ కమిషనర్ శంకరయ్య
పటాన్చెరు అభివృద్ధి స్ఫూర్తిదాయకంగా ఉందని జోనల్ కమిషనర్ శంకరయ్య అన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే నిధులను వెనక్కి వెళ్లకుండా తీసుకుంటున్న చర్యలు నచ్చాయన్నారు. పటాన్చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో శాంతిభద్రతలను కాపాడేందుకు 24గంటలు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తనకు ఉదయం వేళలోనే ఫోన్ చేసి శాంతిభద్రతలపై చర్చిస్తారని పేర్కొన్నారు. సమీక్షలో మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఇరిగేషన్, విద్యుత్‌శాఖల డీఈలు, వివిధశాఖల అధికారులు వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ కుంచాల ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్లు తుమ్మల పాండురంగారెడ్డి, లలితాసోమిరెడ్డి, కొలన్ రోజాబాల్రెడ్డి, ఎంపీపీలు సుష్మశ్రీవేణుగోపాల్‌రెడ్డి, ఈర్ల దేవానందం, ప్రవీణభాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్పానగేశ్‌యాదవ్, సింధూఆదర్శ్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయికాడి విజయ్‌కుమార్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, వైస్ చైర్మన్లు నర్సింహాగౌడ్, రాములుగౌడ్, జిన్నారం ఎంపీటీసీ వెంకటేశంగౌడ్, శ్రీధర్‌చారీ, చంద్రారెడ్డి, గూడెం మధుసూధన్‌రెడ్డి, డీసీ బాలయ్య, కరణ్, సర్పంచ్‌లు సుధీర్‌రెడ్డి, ఉపేందర్ముదిరాజ్, నితిషాశ్రీకాంత్, ఎర్పుల కృష్ణ, మల్లేశ్, నాగరాజుయాదవ్, భాస్కర్‌గౌడ్, విప్లవత్ రవి, ఎంపీటీసీలు మన్నెరాజు, మాజీ ఎంపీపీలు యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, వడ్డే కుమార్, మోటే కృష్ణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు ఈర్ల రాజు, బేగరి పాండు, ఎండీ అఫ్జల్, యూనూస్, గోల్కొండ లక్ష్మణ్, అంతిరెడ్డి, దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.