మెదక్ అర్బన్, జూలై14: నేరస్తులకు శిక్ష పడే విధంగా కోర్టు డ్యూటీ పోలీసు అధికారులకు కృషి చేయాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన క్యార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో కోర్టు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ మాట్లాడుతూ నేరస్తుల కు సంబంధించిన సమన్లు, వారెంట్లు, సీసీటీఎన్ఎస్లో నమోదు చేయడం, సాక్షులను మోటివేట్ చేయడం వంటి అంశాలపై సూచనలు చేశారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా కోర్టుకు వెళ్లి కోర్టులో జరుగుతున్న ప్రాసెస్ సీసీడీలు, సమన్స్, వారెంట్స్ను క్రమం తప్పకుండా సీసీటీఎన్ఎస్లో ఎంట్రి చేయాలని సూచించారు.
కోర్టు కానిస్టేబుళ్ల్ల్లు ఎన్బీడబ్ల్యూ క్రమం తప్పకుండా అమలు పరిచి నేరస్తులకు శిక్షలు పడే విధంగా కృషి చేయాలన్నారు. కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చా లా కీలకమైనదని, నేరరహిత సమాజాన్ని తీర్చిదిద్దాలంటే నిందితులను కోర్టులో శిక్షపడే విధంగా కోర్టు పోలీసు సిబ్బంది శ్రమించాల న్నారు. కోర్టు నందు ఎప్ఐఆర్లను సరైన సమయంలో అందించాలి. కేసుల్లో ఉన్నటు ప్రాపర్టీని సరైన సమయంలో కోర్టు ఎదుట డిపాజిట్ చేయాలి. కోర్టు సమాచారం ప్రాసిక్యూషన్కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సం బంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఉన్నతాధికారులకు తెలియాజేయాలన్నారు. కోర్టు క్యాలెండర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, కేసు ట్రయల్స్ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. కోర్టు పెండింగ్ ట్ర యల్ కేసులు, వారెంట్స్, సమన్స్, సీసీటీఎన్ఎస్లో డాటా ఎంటర్ చేయాలని సూచించారు. ఈ డాటాను టీఎస్కాప్ (పోలీసుల ప్రత్యేక పోర్టల్)కు అనుసంధానం చేయడం ద్వా రా ప్రతి రోజు కోర్టు ప్రాసెస్ ఎలా జరగుతున్నదని ఆన్లైన్లో తెలువడంతో పాటు కానిస్టేబుళ్ల పని సులభతరం అవుతుందని తెలిపారు. ప్రతి రోజు కోర్టులో ట్రయల్ జరిగిన కేసులు ఎంటర్ చేసినచో పెండింగ్ లేకుండా ఉంటుందన్నా రు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి, నారాయణరెడ్డి, సీఐలు, ఎస్.ఐలు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.