సంగారెడ్డి అర్బన్, జూలై 14: ప్రభుత్వ దవాఖానలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపట్టాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లా దవాఖాన ఆర్ఎంఓ, సూపరింటెండెంట్లను ఆదేశించారు. గురువారం జిల్లా దవాఖా నను కలెక్టర్ తనిఖీ చేశారు. దవాఖాన మొత్తం కలియతిరిగి వార్డులను, ఆయా గదులను పరిశీలించారు. బ్లడ్ టెస్ట్, స్కానింగ్ తదితర టెస్టులకు సంబంధించిన రిజిస్టర్‌ను పరిశీలించారు. దవాఖాన పరిసరాలను పరిశీలిం చి పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
మెడికల్ కళాశాల నిర్మా ణ పనుల పురోగతిని పరిశీలించి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు, వైద్య సిబ్బంది దవాఖానకు వచ్చే రోగులకు మేమున్నామంటూ భరోసా కల్పించాలన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లా దవాఖాన లోని పాత భవనంలో కొన్ని వార్డుల్లో నీరు కారుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఒక భవనానికి మరో భవనానికి మధ్య జాయింట్స్ ఉన్న చోట అక్కడక్కడ నీటి చుక్కలు కారుతున్నట్లు గమనించామని, ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తున్నామని అధికారులు వివరించారు.
దవాఖానలో రెండున్నర నెలల నుంచి లిఫ్ట్ పని చేయ డం లేదని తన దృష్టికి వచ్చిందని వారం రోజుల్లో మరమ్మతులు చేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దవాఖాన పరిసరాల పరిశుభ్రత బాగుండాలని సంబంధిత ఏజెన్సీకి స్పష్టం చేశారు. దవాఖానలో వైద్యులు, సిబ్బంది రోగులకు అందిస్తున్న సేవలు బాగున్నాయని, దవాఖాన అంతా పరిశుభ్రంగా ఉందని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాల పనులను మరింత వేగవంతంగా పూ ర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రాజర్షి షా, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్‌కుమార్, ఆర్అండ్బీ, టీఎస్ఐఎంఐడీసీ ఈఈలు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.