మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకన్న
కూలిన ఇండ్లను పరిశీలించిన ఎంపీపీ
కోహెడ, జూలై 14 : మండలంలోని తంగళ్లపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు కూలిన ఇండ్లను ఎంపీపీ కీర్తి పరిశీలించారు. బాధితులను పరామర్శించి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని ఎంపీపీ హామీ ఇచ్చారు. మండలంలో ఇండ్లు కూలిన వివరాలను తహసీల్దార్ జావెద్ వివరించారు. ఆమె వెంట టీఆర్ఎస్ జిల్లా నాయకులు నాగరాజు, మధుసూదన్‌రావు, సర్పంచ్ నాగేశ్వరి, ఎంపీపీ శేఖర్, నాయకులు ఉన్నారు.
వర్షాలకు కూలిన ఇండ్లు
రాయపోల్, జూలై 14 : వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాల్లో పాత ఇండ్లు కూలిపోయాయి. రాయపోల్ మండల కేంద్రానికి చెందిన తుడుం లక్ష్మికి చెందిన ఇల్లు కూలిపోయింది. మండలంలోని అప్పటివరకు వర్షాలకు 27 ఇండ్లు కూలినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇండ్లు కూలినవారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు.
తెరిచి ఉన్న గుంతలు.. పొంచి ఉన్న ప్రమాదం
చేర్యాల, జూలై 14 : మున్సిపాలిటీ పరిధిలోని 11, 12వ వార్డుల్లో మ్యాన్‌హోల్స్ తెరిచి ఉండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ వార్డుల్లో మ్యాన్‌హోల్స్ మరమ్మతులు చేయకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని వార్డు ప్రజలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా 12వ వార్డు కౌన్సిలర్ సతీశ్‌గౌడ్ మాట్లాడుతూ వార్డులో మ్యాన్‌హోల్ విషయం కమిషనర్ రాజేంద్రకుమార్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోవడం లేదన్నారు. సంబంధితశాఖ అధికారులు ప్రమాదం జరుగకముందే మ్యాన్‌హోల్స్‌కు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.