హవేళీఘనపూర్, జూలై 14: జిల్లాలో ఎంపీ లు, ఎమ్మెల్యేలు, అధికారులు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం వాడీ పంచాయతీ పరిధిలోని దూప్‌సింగ్ తండాలో కూలిపోయిన బ్రిడ్జి ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండి సేవలందిస్తున్నారని తెలిపా రు. దూప్‌సింగ్‌తండాలో శాశ్వత బ్రిడ్జి నిర్మాణాని కి రూ.3కోట్లు మంజూరు చేయాలన్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఏటా వానకాలంలో ఈ బ్రిడ్జితో తండా వాసులకు ఇబ్బంది ఎదురవుతున్నందున, శాశ్వత బ్రిడ్జిని నిర్మించేందుకు ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రస్తు తం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామన్నారు. అనంతరం సర్దన పీహెచ్సీ సిబ్బంది తమ పరిధిలో చేపడుతున్న వైద్యసేవలు, డెలివరీలు, జ్వరసర్వే గురించి హెల్త్ సూపర్వైజర్ మదన్, సిబ్బందిని ఆయన అడిగి తెలుసుకున్నా రు. అనంతరం బూర్గుపల్లి గ్రామ జడ్పీ హైస్కూల్లో రూ.40లక్షలతో నిర్మించిన 4 అదనపు తరగతి గదులను ప్రారంభించారు.
శిథిలావస్థలో ఉన్న ప్రైమరీ స్కూల్ నిర్మాణానికి నిధుల మంజూరు చేయాలని ఈ సందర్భం గా గ్రామ సర్పంచ్ చెన్నాగౌడ్ మంత్రికి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న పాఠశాల శిథిలావస్థకు చేరినందున, మరో ఐదు అదనపు గదుల నిర్మాణానికి నిధుల మంజూరు చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ హరీశ్, మెదక్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, ఆర్డీవో సాయిరామ్, సర్పంచ్ యామిరెడ్డి, చెన్నాగౌడ్, సాయిలు, కాట్రోత్ కిషన్, ఎంపీటీసీ సిద్దిరెడ్డి, దుర్గారావు, అర్చనశ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, డైరెక్టర్ సాప సాయిలు, టీఆర్ఎస్ నాయకులు మేకల సాయిలు, భిక్షపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.