మెదక్ మున్సిపాలిటీ/ చేగుంట/ మెదక్‌రూరల్/ రామాయంపేట/ శివ్వంపేట/ పెద్దశంకరంపేట/ నర్సాపూర్/ తూప్రాన్/ కొల్చారం/ వెల్దుర్తి, జూలై 13 : జిల్లావ్యాప్తంగా బుధవారం గురుపౌర్ణమి పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధ్దలతో నిర్వహించారు. జిల్లాకేంద్రం మెదక్‌లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో అర్చకులు శంకర్శాస్త్రి, పూర్ణచందర్రావు ఆధ్వర్యంలో మేలుకొలుపు, అభిషేకం, హారతి, సాయినామార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం, సాయంత్రం పల్లకీ సేవ చేపట్టారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్‌లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు. ఎమ్మెల్యేను ఆలయ కమిటీ అధ్యక్షుడు చింతల వినోద్, బాధ్యులు గంజి శ్రీనివాస్, నాగరాజు, సంగ శ్రీకాంత్‌తోపాటు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్, కౌన్సిలర్లు శ్రీనివాస్, లక్ష్మీనారాయణగౌడ్, వసంత్‌రాజ్, మాజీ కౌన్సిలర్ ముత్యంగౌడ్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ, టీఆర్ఎస్ నాయకులు గడ్డమీది కృష్ణాగౌడ్, లింగారెడ్డి, శివరామకృష్ణ, ప్రభురెడ్డి తదితరులు ఉన్నారు.
కర్నాల్‌పల్లి సాయిమందిరంలో వేడుకలు
చేగుంట మండలం కర్నాల్పల్లిలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో క్షీరాభిషేకం, కలశ పూజ, అభిషేకం, పుష్పార్చన, అలంకరణ ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్న హారతి అనంతరం అన్నదానం చేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ వ్య వస్థాపకుడు ఆంజనేయులు, చైర్మన్ రమేశ్గుప్త్తా, అన్నదాన కమిటీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కమిటీ సభ్యులు యాదిరెడ్డి, ఎర్వ బాల్‌రెడ్డి, తుమ్మ యాదగిరి, రాంరెడ్డి, గోపాల్‌రెడ్డి, నాగలింగం, నాగరాజు, శ్రీనివాస్, రాజేశ్వర్, ప్రకాశ్ ఉన్నారు.
రామాయంపేటలోని సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ బచ్చు భూమయ్య, వెంకటలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వేంకటేశ్వర, మహంకాళి, మార్కండేయ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శివ్వంపేట మండలం గూడూరుకు చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది శివకుమార్‌గౌడ్ యాప్రాల్‌లో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఎంపీపీ హరికృష్ణ, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు సందీప్ తూప్రాన్‌లోని సాయిబాబా ఆలయంలో పూజలు చేశారు.
నర్సాపూర్‌లోని ఎన్జీవోస్ కాలనీలో గురుపౌర్ణమి సందర్భంగా అభిషేకాలు, హారతి, అన్నదానాలు నిర్వహించారు.
తూప్రాన్ పట్టణంలోని షిర్డీ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యం లో గురు పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్, జగదీశ్వర్, జయప్రద, మోహన్‌రావు, సాయిబాబా, విష్ణు, వెంకటరాంరెడ్డి, ధన్‌రాజ్, నగేశ్, గణేశ్, వెంకటనారాయణ, రవీంద్రనాథ్, వెంకటస్వామి, లింగం, సాయిప్రవీణ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
వెల్దుర్తిలో భక్తిశ్రద్ధలతో సాయిపల్లకీ సేవ
వెల్దుర్తిలోని రాజరాజేశ్వరీ దేవాలయంలో మహిళలు సాయిబాబాకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ వీధుల్లో పల్లకీ సేవ నిర్వహించారు. మాసాయిపేట సాయిబాబా దేవాలయంలో పంచామృతాభిషేకాలు, విశేషాలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు.
మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
మెదక్ మండలం మంబోజిపల్లి శివారు కొయ్యగుట్టపై కొలువు దీరిన మల్లికార్జునస్వామి అలయంలో ప్రత్యేక పూ జలు, హోమం నిర్వహించారు. అనంతరం మహిళా భక్తులు మంగళహారుతులతో ఒడి బియ్యం సమర్పించారు.
రంగంపేట ఆశ్రమంలో ప్రత్యేక పూజలు
అజ్ఞాన చీకట్లను పారద్రోలి జ్ఞాన వెలుగుల వైపు నడిపించే దైవమే గురువు అని రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి అన్నారు. ప్రతి ఒక్కరూ గురువును పూజించాలని స్వామి అన్నారు. రంగంపేట ఆశ్రమంలో గురు పాదుకలకు భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.
శిశుమందిర్‌లో గురు పౌర్ణమి వేడుకలు
మెదక్ జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్‌లో వ్యాస మహర్షి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో సరస్వతీ విద్యాపీఠం జిల్లా కోశాధికారి కాశీనాథ్, పాఠశాల కార్యదర్శి మచ్చేంద్రనాథ్, బాధ్యులు పవన్, నారాయణ, సవిత, అశోక్, ప్రధానచార్యులు సుధారాణి ఉన్నారు.
పెద్దశంకరంపేట సరస్వతీ శిశుమందిరంలో గురుపూజోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు వీరప్ప, ఆచార్యులు జైహింద్‌రెడ్డి, శ్రీనివాస్, పూర్వ విద్యార్థు లు సీతారామరావు, రవివర్మ, సతీష్‌గౌడ్, సర్వేశ్వర్ ఉన్నారు.