పటాన్చెరు, జూలై 13 : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. బుధవారం కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్పానగేశ్, సింధూఆదర్శ్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి తమ డివిజన్లలో పలు అభివృద్ధి పనుల కోసం వినతిపత్రం అందజేశారు. మూడు డివిజన్లలో పలు పెండింగ్ పనులను పూర్తిచేసేందుకు దాదాపు నిధులు రూ.100 కోట్లు మం జూరుకు ప్రతిపాదన కావాలని ఎమ్మెల్యే మం త్రికి విన్నవించారు. సీసీరోడ్లు, డ్రైనేజీ పనులు, ఫంక్షన్ హాళ్లు, పార్కుల అభివృద్ధి, వైకుంఠధామాలు, ఇతర అభివృద్ధి పనుల జాబితాను మంత్రికి అందజేశారు. మూడు డివిజన్ల అభివృద్ధి కోసం కార్పొరేటర్లు కృషిచేస్తున్నారని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్లు అభివృద్ధిలో వేగంగా పురోగమిస్తున్నాయని మంత్రికి తెలిపారు. 113 డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్ మంత్రికి దాదాపు రూ.32 కోట్ల నిధులు అవసరమని విన్నవించారు.112 డివిజన్ కార్పొరేటర్ పుష్పానగేశ్ తమ డివిజన్లో మీట్ మార్కెట్, మినీ ఫంక్షన్ హాళ్లు, రాయసముద్రం చెరువు ఆధునీకరణ కోసం నిధులు అడిగారు. 111 డివిజన్ కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి తమ డివిజన్లో పెద్దఎత్తున అభివృద్ధి చేయాల్సి ఉందని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ తదితర పనులకు నిధులు కావాలని మంత్రికి వివరించారు. మంత్రి కేటీఆర్ తమ వినతులపై సానుకూలంగా స్పందించారని కార్పొరేటర్లు పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు నగేశ్, ఆదర్శ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.