నిజాంపేట, జూలై 13 : మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారు. కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు భూమాగౌడ్, గ్రామ అధ్యక్షుడు చంద్రగౌడ్, నాయకులు రాజాగౌడ్, ప్రభాకర్‌గౌడ్, వెంకటగౌడ్తో పాటు పది మంది నాయకులు బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు యాదగిరి, మండల కో-అప్షన్ సభ్యుడు గౌస్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.