మెదక్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెదక్ జిల్లాలో 2837 చెరువులు, కుంటలు ఉన్నా యి. మంగళవారం నాటికి 32 చెరువులు పూర్తిగా నిండి అలుగులు పారుతున్నాయి. మరో 102 చెరువులు 75శాతానికి పైగా నీరు చేరింది. 490చెరువుల్లో 50శాతానికి పైగా నిండా యి. మిగతా చెరువులు, కుంటల్లో దాదాపు సగం వరకు నీరు చేరాయి. చెరువుల్లో వర్షపు నీరు నిండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
జిల్లాలో 324 ఇండ్లు పాక్షికంగా…
ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో 324 ఇం డ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. కూలిపోయిన ఇండ్లను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. వెల్దుర్తి మండలం హకీంపేటలో విద్యుత్ షాక్‌తో పుర్ర సుశీల అనే మహిళ మృతి చెందింది. స్పందించిన కలెక్టర్ హరీశ్ మృతి చెందిన సుశీల ఇద్దరు కూతుళ్లకు రూ.1.50లక్ష చొప్పు న రూ.3లక్షల చెక్కును అందజేశారు. జిల్లాలోని ఆయా గ్రా మాల్లో పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు కూలిపోయిన ఇండ్లను పరిశీలించి నివేదికను అందజేస్తున్నారు. ఇప్పటికే గ్రామా ల్లో శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లను పూర్తిగా కూల్చివేశారు.
జిల్లాలో వర్షపాతం ఇలా..
జిల్లాలో 22.1మిల్లిమీటర్ల వర్షపా తం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా నర్సాపూర్ మండలంలో 28.7మి. మీ కాగా, నిజాంపేట మండలంలో 14.0మి.మీ వర్షపాతం నమోదైంది. చిన్నశంకరంపేటలో 26.9 మి.మీ, మెదక్‌లో 26.1మి,మీ, కౌడిపల్లిలో 25.1 మి,మీ, తూప్రాన్‌లో 22.3మి,మీ, మనోహరాబాద్ లో 22.5మి,మీ, చిలిపిచేడ్‌లో 23మి,మీ హవేళీఘనపూర్‌లో 25.2 మి,మీ, పాపన్నపేటలో 24.0మి,మీ, అల్లాదుర్గంలో 25.9మి,మీ, టేక్మాల్‌లో 23.7మి,మీ, రేగోడ్‌లో 24.0 మి, మీ, వెల్దుర్తిలో 21.0 మి,మీ, శివ్వంపేటలో 21.8 మి,మీ, నార్సింగిలో 19.5మి,మీ, మాసాయిపేటలో 19.8 మి,మీ, చేగుంటలో 17.9 మి,మీల వర్షపాతం నమోదైంది.
అలుగుపారుతున్న చెరువులు, కుంటలు
సంగారెడ్డి, జూలై 12(నమస్తే తెలంగాణ): కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. చెరువులు కుంటలు ఆలుగులు పారుతున్నాయి. అధికారులు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 35.5సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జిన్నారంలో 4.6సెం.మీ నమోదవగా, న్యాల్కల్ మండలం లో అత్యల్పంగా 8 మి.మీ వర్షం కురిసింది. 14మండలాల్లో 59శాతంకు పైగా నమోదవగా నాలుగు మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. గుమ్మడిదలలో 4.3 సెం.మీటర్లు, కల్హేర్‌లో 2.4 సెం.మీటర్లు, మనూరులో 2.2, జహీరాబాద్‌లో 2.1, కోహీర్, ఝరాసంగం, మునిపల్లి, సదాశివపేట మండలాల్లో రెండుమీటర్ల వర్షపాతం నమోదైంది. వట్పల్లి మండలంలో 2.4సెం.మీ, అందోల్‌లో 2.6, పుల్కల్లో 2.3 సెం.మీ వర్షం కురిసింది. మిగితా మండలాల్లో 1 నుంచి 1.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. వర్షాలతో జిల్లాలో ఎక్కడా ప్రాణ నష్టం సంభవించలేదు.
సింగూరుకు కొనసాగుతున్న వరద
వర్షాలతో జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917టీఎంసీలు. ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుండటంతో నీటి మట్టం రోజు రోజుకు పెరుగుతున్నది. మంగళవారం 5950 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 20.883 టీఎంసీలకు చేరుకున్నది. వరద కొనసాగుతుండటంతో పాటు సింగూరు ప్రాజెక్టు ఎగువభాగమైన కర్ణాటకలో వర్షాలు భారీగా కురిస్తే మరో వారం, పది రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నల్లవాగు ప్రాజెక్టు నిండగా, జహీరాబాద్ సమీపంలోని నారింజ ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. కలెక్టర్ శరత్ ప్రాజెక్టులను పరిశీలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికా రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.