రామాయంపేట, జూలై 12 : సీజనల్ వ్యాధులు ప్రబల కుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ అన్నారు. మంగళవారం రామాయంపేట పట్టణంలో పర్యటించి, ప్రభుత్వ విద్యాసంస్థలను పరిశీలిం చారు. పట్టణంలోని గురుకుల విద్యాలయాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ‘మనఊరు-మనబడి’లో భాగంగా రామాయంపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సం దర్శించారు.
ఈ సందర్భంగా డీఈవో మాట్లాడారు. బాలికల పాఠశాలలో 340 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. బాలికల ఉన్నత పాఠశాలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని, త్వరలో నిర్మాణ పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పాఠశాల భవనం పూర్తయ్యేవరకు విద్యార్థులను దగ్గర్లోనే మూతపడిన ప్రైవేట్ పాఠశా లకు తరలిస్తామని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలతోపాటు ఉచిత విద్య, యూనిఫాం, భోజన సౌకర్యంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం పెట్టాలన్నారు. వర్షాకాలంలో విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా టీచర్లు ప్రత్యేక దృష్టి పెట్టా లని సూచించారు. డీఈవో వెంట హెచ్ఎంలు, టీచర్లు ఉన్నారు.