వెల్దుర్తి, జూలై 11: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మం డలంలోని హల్దీవాగుపై ఉన్న పలు చెక్‌డ్యాంలు అలుగు పా రుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో వస్తున్న వరదతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటుండగా, హల్దీవాగులో నీరు ప్రవహిస్తుండటంతో పాటు వాగుపై ఉన్న చెక్‌డ్యాంలు అలుగు పారుతున్నాయి. మండలంలోని దామరంచ, శెట్పల్లి గ్రామాల పరిధిలో హల్దీవాగుపై ఉన్న మూడు చెక్‌డ్యాంలు మత్తళ్లు దూకుతున్నాయి. పై నుంచి వస్తున్న వరదతో మాసాయిపేట మండలంలోని హల్దీప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతుంది.
పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లు
వర్షాలతో మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లోని నివాస గృహాలు పాక్షికంగా దెబ్బతినగా, శిథిలావస్థకు చేరిన నివాసగృహల్లో ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వెల్దుర్తిలో రెండు ఇండ్లు, మాసాయిపేటలో ఒక ఇల్లు, ఆరెగూడెంలో రెండు ఇండ్లు, కొప్పులపల్లిలో ఐదు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇండ్లు ఉన్నాయని, ఈ ఇండ్లలో నివా సం ఉంటున్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే విద్యుత్ మోటర్లు, స్తంభాలు, కరెంట్ తీగలకు దూరంగా ఉండాలని ఎలాంటి మరమ్మతులు చేయరాదని రైతులకు సూచించారు. విద్యుత్ సమస్యలు తలెత్తిన, తీగలు తెగిన, కిందకు వేలాడిన వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలన్నారు.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం
నిజాంపేట, జూలై 11: నాలుగు రోజులుగా కురుస్తున్న వ ర్షానికి నిజాంపేటలో పాక ఎల్లయ్య, పాక శ్యామలకు చెందిన ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. పాతబడిన ఇండ్లలో ఉం డకూడదని ఎస్సైశ్రీనివాస్రెడ్డి గ్రామస్తులకు సూచించారు.
ఏకధాటి వర్షాలకు చెరువు, కుంటల్లోకి నీళ్లు
కొల్చారం మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సోమవారం ఉదయం నుంచి మండల వ్యాప్తంగా 22.4మి.మీ వర్షపాతం నమోదైంది. ఏకధాటిగా కురుస్తున్న వానలకు చెరువు, కుంటల్లోకి వరద వచ్చి చేరుతున్నది. వానలతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి.