రామాయంపేట, జూలై 11: జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆరోగ్య విస్తీర్ణ అధికారి కరిపె రవీందర్, డాక్టర్ లావణ్య, పీఎచ్ఎన్ఎం సత్తమ్మ పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మండలంలోని డీ.ధర్మారంలో ప్రభుత్వ ప్రాథమిక దవాఖాన నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఫ్లెక్సీతో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడు తూ చిన్న కుటంబం చింతలేకుండా ఉంటుందన్నారు. కుటుంబ నియంత్రణ పాటిస్తే పేదరిక నిర్మూలనకు తోడ్పడుతుందన్నారు. ఒక్కరూ లేదా ఇద్దరు పిల్లల తర్వాత కచ్చితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలన్నారు. దీంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. మహిళలు ట్యూ బెక్టమి లేదా డబుల్ పంచర్ ల్యాప్రోస్కోపీ ద్వారా మగవాళ్లు వ్యాసెక్టమి ఆపరేషన్లు చేసుకోవాలన్నారు. ఆపరేషన్లు డి. ధర్మారం పీహెచ్సీ దవాఖానలో చేస్తున్నామని తెలిపారు. ఈ పద్ధతినే కాకుండా ఆడవాళ్లకు ఐయూడీ, ఓరల్పిల్స్, అం తర ఇంజెక్షన్లు ఉన్నాయన్నారు. అనంతరం దవాఖానలో బా లింతకు సీఎం కేసీఆర్ కిట్‌ను అందజేశారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఉన్నారు.
పెద్దశంకరంపేటలో..
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పేటలో పీహెచ్సీ సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి సారిక మాట్లాడుతూ జనాభాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జనాభా పెరుగుదల వల్ల వచ్చే నష్టాల గురించి ఆమె వివరించారు. జనాభా నియంత్రణ తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది భూమయ్య, సంపూర్ణ, వెంకటరమణ, వెంకటేశం, రామ్మోహన్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
రంగంపేటలో..
మండలంలోని రంగంపేటలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ తీశారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సుదర్శన్, సూపర్వైజర్ రాణి మనోహర, పంచాయతీ కార్యదర్శి నగేశ్, ఏఎన్ఎంలు సంగీత, లక్ష్మి, ఆశ వర్కర్లు భాగ్యలక్ష్మి, రుక్మిణి, రామలక్ష్మి, రజియా పాల్గొన్నారు.