పటాన్చెరు, జూలై 10: మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో సోమవారం అల్‌ప్లా ఇండియా పరిశ్రమలో యూనిట్ ఏర్పాటుకానున్నది. ఈ పరిశ్రమలో వరల్డ్‌క్లాస్ మౌల్డ్ యూనిట్‌ను, డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే.తారకరామారావు ప్రారంభించనున్నారు. రూ.60 కోట్లతో అల్‌ప్లా మౌల్డ్ ప్లాంట్‌ను మంత్రి ఆ సంస్థ గ్లోబల్ సీఈవో ఫిలిప్ లెహ్నార్తో కలిసి కార్యక్రమంలో పాల్గొననున్నారు. దాంతో పాటే భారత పరిశ్రమ సమాఖ్య (సీఐఐ), తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ భాగస్వామ్యంతో పరిశ్రమలో రూ.10 కోట్లతో ఏర్పాటు చేయనున్న డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను మంత్రి ప్రారంభిస్తారు.
ఇప్పటికే ఆస్ట్రేలియా, జర్మనీలో మౌల్డ్షాప్లను అల్‌ప్లా ఏర్పాటు చేసింది. మూడో మౌల్డ్షాప్ను పాశమైలారం యూనిట్లో ప్రారంభిస్తున్నది. ఇప్పటికే తెలంగాణలో అల్‌ప్లా రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ మౌల్డ్షాప్లో అత్యంత క్లిష్టమైన ఇంజక్షన్ మౌల్డ్‌లు, డిజైనింగ్, పూర్తిస్థాయి నిర్మాణం వరకు సాంకేతిక పరిష్కారాలను చూపనున్నది. సంబంధిత ప్రాజెక్టులపై ఆలోచన, రూపకల్పన అమలు కోసం ఉన్నతమైన సాంకేతిక పద్ధతులను ఉపయోగించనున్నారు.

డ్యూయల్ ఎడ్యుకేషన్‌తో ఉత్తమ శిక్షణ..
డ్యూయల్ ఎడ్యుకేషన్ ద్వారా డిప్లొమా విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందుతుంది. అల్ప్లాలో డిప్లొమా రెండో ఏడాది థియరీ పూర్తి చేసుకున్న విద్యార్థులు డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్లో చేరేలా సాంకేతిక విద్యాశాఖ తగిన చర్యలు తీసుకున్నది. ఇందులో మెకాట్రానిక్స్‌లో సరికొత్త సీఎన్సీ మెషిన్లు, అధునాతన టెక్నాలజీపై ఆచరణాత్మక విద్య, శిక్షణ అందజేస్తారు. అల్ ప్లా డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమం నుంచి ప్రేరణ పొంది తెలంగాణలో అమలు చేస్తున్నారు. రూ.10 కోట్లతో ఈ డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను అల్‌ప్లా అందుబాటులోకి తీసుకురానున్నది.
తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ దీనికి సహకారం అందజేస్తున్నది. ఇక్కడ శిక్షణ, సర్టిఫికెట్ అందుకున్న విద్యార్థులకు ప్రాక్టికల్ జ్ఞానం లభిస్తుంది. థియరీ జ్ఞానానికి, పరిశ్రమల్లో ఉపాధి సమయంలో ప్రాక్టికల్ జ్ఞానాన్ని డ్యూయల్ ఎడ్యుకేషన్ అందజేస్తుంది. వరల్డ్ క్లాస్ సాంకేతిక పరిజ్ఞానం వారి జీవితాలకు ఉపయోగ పడనున్నాయి. జీవితానికి ఉపయోగపడే విద్యావిధానం వైపుగా డ్యూఎల్ ఎడ్యుకేషన్ సిస్టం అనుకోవచ్చు. ఇదే సంస్థ తమకు ఉపయోగపడే ఆ విద్యార్థులకు శిక్షణ అనంతరం ఉపాధి కూడా కల్పిస్తామని ముందుకు రావడం, వాటితో పాటు వారికి ైస్టెఫండ్స్ కూడా ఇస్తామని ఆఫర్ చేస్తున్నది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమవుతున్న డ్యూఎల్ ఎడ్యుకేషన్ సెంటర్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వనున్నది. తెలంగాణ సర్కార్, ప్రైవేటు భాగస్వామ్యంతో చేస్తున్న ఈ ప్రయోగం అందరిలో ఆసక్తి రేపుతున్నది.
ఉత్తమమైన సంస్థ..
అల్‌ప్లా ప్రపంచస్థాయిలో ఈ రంగంలో అగ్రగణ్య సంస్థ. 47 దేశాలో ్ల177 ప్లాంట్స్ ఉన్నాయి. పాశమైలారం ప్లాంట్ ఉత్తమమైన 15 ప్లాంట్లలో ఒకటని ఆ సంస్థ తెలుపుతున్నది. ప్లాస్టిక్ రిజిడ్ ప్యాకింగ్ వ్యాపారంలో కంపెనీ గ్లోబల్ లీడర్. దేశంలోనూ అల్‌ప్లా 10 ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఈ రంగంలో దేశంలో అల్‌ప్లా మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్నది. రూ.32వేల 294కోట్ల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా అల్‌ప్లా నిర్వహిస్తున్నది. దేశంలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోనే ఏర్పాటైంది. కంపెనీ డీఅండ్ఐ ఎజెండాపై దృష్టి పెట్టింది. మహిళా ఉద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు దివ్యాంగులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అత్యంత ప్రతిష్టాత్మక కంపెనీ తన కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తుండడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి.