నర్సాపూర్/ పాపన్నపేట/ కొల్చారం/ మెదక్ రూరల్/ పెద్దశంకరంపేట/ చిన్నశంకరంపేట/ శివ్వంపేట/ టేక్మాల్/ తూప్రాన్/ రామాయంపేట/ చేగుంట/ నిజాంపేట, జూలై 10 : నర్సాపూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఆదివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. నర్సాపూర్ మండలంలో 41.6 మీ.మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వెల్దుర్తి మండలంలోని హల్దీవాగులోకి భారీగా వరద చేరు తున్నది. చిలిపిచెడ్ మండలంలోని అజ్జమర్రి గ్రామ శివారు లో మంజీరా నదిపై నూతనంగా నిర్మించిన చెక్‌డ్యామ్ పూర్తి గా నిండి పొంగిపొర్లుతున్నది. కొల్చారం, కౌడిపల్లి, మాసాయిపేట్, శివ్వంపేట మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. చెరువులు, కుంటలోకి వరద వస్తుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. పాత, శిథిలావస్థకు చేరిన ఇండ్లను ఖాళీచేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించారు.
భారీ వర్షాలకు పాక్షికంగా కూలిన ఇండ్లు
పాపన్నపేట మండలంలో రామతీర్థం గ్రామానికి చెం దిన కయ్యం బాల్రెడ్డికి చెందిన ఇల్లు పాక్షికంగా కూలింది. బాచారం గ్రామంలో గుడిసె పూర్తిగా కూలిపోయింది.
కొల్చారం మండలవ్యాప్తంగా చెరువు, కుంటల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఎనగండ్లలో బేలూరి కిష్టయ్య ఇల్లు పాక్షికంగా కూలింది. టేక్మాల్ మండలకేంద్రంలో బాజ శివ య్య ఇల్లు పాక్షికంగా ధ్వంసమైనది. గోడ కూలే సమయంలో ఇంటిలో శివయ్య, భార్య లచ్చమ్మ మాత్రమే ఉన్నారు. కూలిన గదిలో కాకుండా మరో గదిలో నిద్రిస్తుండడంతో ప్రమా దం తప్పింది. శివ్వంపేట మండలం అల్లీపూర్ గ్రామంలో డాకూరి సాయిలు తండ్రి దుర్గయ్యకు చెందిన పెంకుటిల్లు కూలింది. వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేశ్‌గుప్తా సూచించారు. ఏదైనా సమస్య వస్తే తమకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మెదక్ మండలంలో వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తం గా ఉండాలని రూరల్ ఎస్సై మోహన్‌రెడ్డి సూచించారు. పాత ఇండ్లలో నివసిస్తున్నవారు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు పెద్దశంకరంపేట మండలంలో 56.4 మి.మీ వర్షపాతం నమోదైనది. ఆయా చెరువుల్లోకి వరద చేరుతున్నది.
చెరువులు, కుంటలకు చేరుకుంటున్న వర్షపు నీరు.
రామాయంపేట, తూప్రాన్, చేగుంట, నిజాంపేట మండలాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. రామాయంపేట మండలంలోని సుతారిపల్లి, పర్వతాపూర్, దంతెపల్లి, కిషన్‌నాయక్‌తండాలో పాత ఇండ్లు కూలాయి. చేగుంట మం టడలం కర్ణాల్పల్లి, తూప్రాన్ మండలం నాగులపల్లిలో పెంకుటిల్లు పాక్షికంగా దెబ్బతిన్నది. తూప్రాన్ మండల వ్యా ప్తంగా 47.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇస్లాంపూర్‌లో చెక్‌డ్యాం నిండి పొర్లుతున్నది. ముసురు వానతో రోడ్ల న్నీ బోసిపోయాయి. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు.