పెద్దశంకరంపేట/ మెదక్రూరల్/ రామాయంపేట/ నిజాంపేట/ కొల్చారం/ వెల్దుర్తి/ చేగుంట/ తూప్రాన్, జూలై 9 : జిల్లావ్యాప్తంగా ముసురు కమ్ముకున్నది. మూడు రోజులుగా ముసురుపట్టిం ది. పెద్దశంకరంపేట మండలంలో శనివారం 32. 4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. వానలు పడుతుండడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతన్నలు ప ట్టణానికి వచ్చి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.
జోరుగా వరినాట్లు
మెదక్ మండలంలో రెండు రోజులుగా కురుసున్న వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. బొల్లారం, ర్యాలమడుగు ప్రాజెక్టుల్లో వరదనీరు చేరడంతో బోరు బావుల్లోకి పుష్కలంగా నీరు చేరింది. ఫలితంగా గ్రామాల్లో వ్యవపాయ పనులు, వరి నాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.
కురుస్తున్న వర్షం..
నిజాంపేట మండలవ్యాప్తంగా 6.2 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైనది. నాట్లు వేసే సమయానికి వర్షాలు పడుతుండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తూ వ్య వసాయ పనులతో బిజీగా ఉన్నారు. వర్షం కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలు, తెగిన తీగలను తాకరాదని విద్యుత్ అధికారులు గ్రామస్తులకు సూచిస్తున్నారు.
కుంగిన ఝన్సీలింగాపూర్ బ్రిడ్జి
రామాయంపేట మండలంలో వారం రోజులుగా కు రుస్తున్న వర్షాలకు చెరువుల్లోకి నీరు చేరుకుంటున్నది. ఈదురుగాలులతో మెదక్-రామాయంపేట రోడ్డులో చెట్లు నేలకూలాయి. దీంతో గంటపాటు ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఝాన్సీలింగాపూర్లో ఇటీవల నిర్మించిన బ్రిడ్జి కుంగిపోయింది.
కొల్చారం మండలంలో 27.4 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు, కుంటల్లో వరదలు వచ్చి చేరుతున్నాయి.
ఉమ్మడి వెల్దుర్తి మండలంలో వర్షం ఏకధాటిగా కురుస్తున్నది. వెల్దుర్తిలో శనివారం వారాంతపు అంగడికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. వెల్దుర్తి మండలంలో 16, మాసాయిపేట మండలంలో 15.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వానకాలం సాగు పనులు జోరందుకున్నాయి.
తూప్రాన్ మండలంలోని నాగులపల్లిలో మహంకాళి అంజయ్యకు చెందిన పెంకుటిల్లు పాక్షికంగా కూలింది.
ఇబ్రహీంపూర్లో కూలిన ఫౌల్టీఫామ్
చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెం దిన కొమండ్ల నారాయణరెడ్డికి చెందిన ఫౌల్టీఫామ్ పూర్తి గా కూలిపోయింది. ఫౌల్టీఫామ్ కూలడంతో సూమారు రూ.5లక్షల నష్టం వాట్లిందని నారాయణరెడ్డి తెలిపారు. పాత ఇల్లూ కూలిపోయే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో సూచించారు.