నర్సాపూర్/ నిజాంపేట/ అల్లాదుర్గం/ తూప్రాన్/ మనోహరాబాద్, జూలై 7 : ప్రశాంత వాతావరణంలో పండుగల ను నిర్వహించుకోవాలని సీఐ షేక్‌లాల్ మధార్ అన్నారు. గురువారం నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌లో మత పెద్దలతో శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రానున్న బక్రీద్, ఏకాదశి, బోనాల పండుగలను శాం తియుతంగా, ప్రశాంత వాతావరణంలో సంతోషంగా నిర్వ హించుకోవాలని సూచించారు. ఘర్షణలకు చోటు లేకుండా ఐక్యంగా ఉంటూ పండగలను సామరస్యంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎస్సై గంగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, మత పెద్దలు పాల్గొన్నారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు
– ఎస్సైలు శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి
రానున్న బక్రీద్, ఏకాదశి, బోనాల పండుగలను ముస్లిం లు, హిందువులు ప్రశాంత వాతవరణంలో నిర్వహించుకోవాలని నిజాంపేట ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిజాంపేట పోలీస్‌స్టేషన్‌లో ప్రజాప్రతినిధులు, ముస్లిం, హిందు మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, వాటికి భం గపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ ఆజీజ్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు మావురం రాజు, నాయకులు ఉన్నారు.
ప్రజలందరూ పండుగలను శాంతియత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్సై ప్రవీణ్‌రెడ్డి సూచించారు. అల్లాదుర్గం పోలీస్‌స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం నిర్వహిం చారు. బక్రీద్ సందర్భంగా గోవధ చేయరాదని, చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యలుంటే 100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దన్నారు.
సోదరభావంతో మెలగాలి : తూప్రాన్ సీఐ శ్రీధర్
మత సామరస్యాన్ని పాటిస్తూ పండుగలను నిర్వహించుకోవాలని తూప్రాన్ సీఐ శ్రీధర్ కోరారు. తూప్రాన్ పోలీస్‌స్టేష న్లో శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలు సోదరభా వంతో ఉండాలన్నారు. మనోహరాబాద్‌లో ఎస్సై రాజుగౌడ్ మతపెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో తూప్రాన్ ఎస్సై సురేశ్‌కుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.