శివ్వంపేట/ కొల్చారం/ రామాయంపేట/ చేగుంట, జూలై 7 : రైతులు పంటల సాగులో నూతన పద్ధతులు, సాగు విధానాలతోపాటు యంత్రాలను వినియోగించాలని ఏఈవోలు సుభాష్, మాజిద్ అలీ పేర్కొన్నారు. డ్రమ్ సీడర్ ద్వారా వరి వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. శివ్వంపేట మండలంలో చిన్నగొట్టిముక్ల గ్రామంలో గురు వారం డ్రమ్‌సీడర్ వినియోగాన్ని క్షేత్రస్థాయిలో వివరించా రు. నవాబ్‌పేటలో వరిలో వెదజల్లే పద్ధ్దతిని ఏఈఓ మాజీద్అలీ వివరించారు. డ్రమ్‌సీడర్, వెదజల్లే పద్ధ్దతుల్లో వరి పం టను సాగు చేస్తే ఎకరాకు రూ.8వేల ఖర్చు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. కార్యక్రమాల్లో రైతులు భీంరావు, నర్సింహారెడ్డి, భాస్కర్‌రెడ్డి ఉన్నారు.
జీవ ఎరువుల వాడకంతో లాభం : ఏవో శ్వేతకుమారి
జీవ ఎరువుల వాడకం రైతులకు లాభసాటిగా ఉంటుందని ఏవో శ్వేతకుమారి తెలిపారు. మండల కేంద్రం కొల్చారంలో ఫాస్పరస్ సోలుబ్యూజింగ్ బ్యాక్టీరియా(పీఎస్బీ)జీవఎరువు వాడకం వివరించారు. పీఎస్బీ వినియోగంతో భూమితో ఎక్కువైన భాస్వరాన్ని కరిగించి, మొక్కకు అందిస్తుందని తెలిపారు. అనంతరం పంటల యాజమాన్య పద్ధతులు వివరించారు. ఏవోవెంట ఏఈవో వినీత ఉన్నారు.
పాస్ఫరస్ బ్యాక్టీరియా భాస్వరాన్ని కరిగిస్తుంది..
సాగులో జీవ ఎరువులైన పీఎస్బీని వాడాలని ఇన్చార్జి ఏడీఏ రాజినారాయణ, ఏఈవోలు సాయికృష్ణ, రాజు సూ చించారు. రామాయంపేట మున్సిపల్లోని కోమటిపల్లిలో వరినాట్లను పరిశీలించి, పీఎస్బీ ద్రావణ వినియోగాన్ని వివరించారు. నార్సింగి మండలం సంకాపూర్ లో జీవ ఎరువులు, యాజమాన్య పద్ధతులను ఏవో యాదగిరి వివరించారు. ఆయన వెంట ఏఈవో దివ్య, రైతుబంధు అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, రైతులు స్వామిగౌడ్, బాల్‌రాజు ఉన్నారు.