మెదక్ రూరల్/ మెదక్ మున్సిపాలిటీ/ రామాయంపేట/ వెల్దుర్తి, జూలై 7 : పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ప్రభుత్వం హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాలకు చేపడుతున్నదని సర్పంచ్ సరోజామోహన్ అన్నారు. మెదక్ మండలం మాల్కాపూర్‌లో ఏపీవో వేణుగోపాల్‌రెడ్డి, ఆర్ఐ చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకులు బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలం పరిశీలించారు. త్వరలో చేప ట్టనున్న హరితహారంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : కౌన్సిలర్ కల్యాణి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ మేడి కల్యాణి అన్నారు. పట్టణంలోని 9వ వార్డు లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మధుసూదన్‌రావు, మున్సిపల్ సి బ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రజలు ఇంటి, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.
పల్లెలకు ప్రకృతి వనాలు అకర్షణ : ఎంపీడీవో యాదగిరిరెడ్డి
బృహత్ పల్లె ప్రకృతి వనాలు పల్లెలకు అందాన్నిస్తున్నాయని ఎంపీడీవో యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. రామాయంపేట మండలం సుతార్‌పల్లి, శివాయిపల్లి, ఆర్.వెంకటాపూర్ గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీలను పరిశీలించారు. మండ లానికి నాలుగు బృహత్ పల్లె ప్రకృతి వనాలు మంజూరైనట్లు తెలి పారు. ప్రకృతి వనాలకు స్థలాలను గుర్తించి ఎంపిక చేయాలన్నారు.
కాలుష్యాన్ని నివారించాలి : కౌన్సిలర్ యాదగిరి
మొక్కలను నాటి పర్యావరణా న్ని పరిరక్షించడంతోపాటు కాలుష్యాన్ని నివారించాలని రామాయంపేట 6వ వార్డు కౌన్సిలర్ యాదగిరి అన్నారు. వార్డులో ప ర్యటించి, హరితహారం ప్రాముఖ్య త వివరించి, త్వరలో ఇంటింటికీ 5 మొక్కలు అందజేస్తామన్నారు.
హరితహారంపై అధికారులతో సమీక్ష
వెల్దుర్తి మండలంలో హరితహారంపై పంచాయతీ కార్యదర్శులు, టీఏలతో అధికారులు సమీక్ష నిర్వహించారు. హరితహారం కార్యక్ర మంలో భాగంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేస్తూ ప్రజలతో భారీ సంఖ్యలో మొక్కలు నాటేందుకు కృషి చేయాలన్నారు. సమీక్షలో ఎంపీడీవో జగదీశ్వర్‌చారి, ఎంపీవో విగ్నేశ్వర్, ఏపీవో రాజు, డిప్యూటీ ఫారెస్ట్ట్ రేంజ్ ఆఫీసర్ రవికుమార్, ఫారెస్టు అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ లక్ష్యాన్ని చేరాలి : ఎంపీపీ కల్లూరి హరికృష్ణ
శివ్వంపేట, జూలై 7 : హరితహారంలో ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఫారెస్టు, ఈజీఎస్, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. శివ్వంపేట మండలంలో 4 లక్షల 70వేల మొక్కలను నాటాలనే లక్ష్యం ఉందని తెలిపారు. క్రీడా ప్రాంగణాల పనులు పూర్తి చేయాలని కోరారు. చిన్నగొట్టిముక్ల, కొత్తపేట, పిల్లుట్ల, అల్లీపూర్లో మినీ బృహత్, పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామం లో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని సూచించారు. సమీక్షలో ఎఫ్ఆర్వో అంబర్‌సింగ్, తహసీల్దార్ శ్రీనివాస్‌చారి, ఎంపీవో తిరుపతిరెడ్డి, ఏపీవో అనీల్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.