చేగుంట/ మెదక్ మున్సిపాలిటీ/ అల్లాదుర్గం, జూలై 7 : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ పేర్కొన్నారు. చేగుంట మం డలంలోని పోతాన్‌పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యతోపాటు భో జనం, యూనిఫాం ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ‘మనఊరు- మనబడి’ ద్వారా ప్రతి పాఠశాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం రామారావు, సర్పం చ్ కారింగుల సంతోష, ఎస్ఎంసీ చైర్మన్ అంజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కారింగుల సిద్ధ్దిరెడ్డి, మమ్మద్అలీ, వేణుగోపాల్‌శర్మ, సిద్ధిరాములు, హరిప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మున్నూరుకాపు విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్..
మున్నూరుకాపు విద్యార్థి వసతిగృహం ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ అందజేస్తున్నామని, ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్నూరుకాపు మహాసభ మాజీ ఉపాధ్యక్షుడు బండ నారాయణ పటేల్ తెలిపారు. మెదక్‌లోని పిట్లంబేష్ మున్నూరుకాపు సంఘం భవనంలో దరఖాస్తులను స్వీకరించారు. 8, 9, 10వ తరగతి చదువుతున్న మున్నూరుకాపు విద్యార్థులు 10వ తేదీలోగా హైదరాబాద్‌లోని కాచిగూడ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు ఆది బలరాం, కొంగోటి గట్టేశ్, వెంకయ్య, కొత్త దశరతం, సిద్ధ్దయ్య, తిరుపతి, శ్రీనివాస్ మెదక్ కోఆర్డినేటర్ వీర్‌కుమార్, జగన్, రాజు పాల్గొన్నారు.
విద్యార్థులకు సన్మానం
అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులను సర్పంచ్ మల్లేశం, ఉప సర్పంచ్ రమేశ్, హెచ్ఎం హీనా, ఎంపీటీసీ మంజుల సన్మానించారు.