హత్నూర, జూలై 7 : హత్నూర మండలం నస్తీపూర్ గ్రామాన్ని గురువారం పంజాబ్ రాష్ట్రంలోని ఎన్ఆర్ఎల్ఎం బృందం సభ్యులు సందర్శించారు. ఈసందర్భంగా గ్రామంలో పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా స్వయం సహాయక బృందాల పనితీరుతో పాటు మహిళలు సాధిస్తున్న ఆర్థిక అభివృద్ధి, చేపడుతున్న సామాజిక సేవాకార్యక్రమాల పనితీరుపై ఆరాతీశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీవో సూర్యారావు, ఎన్ఆర్ఎల్ఎం కో-ఆర్డినేటర్ మహాన్జైన్, డీపీఎం కొమురయ్య, సర్పంచ్ ఎల్లయ్య, ఏపీఎంలు శ్రీదేవి, రవిశేఖర్, డీజీఎం బాలరాజు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.