గజ్వేల్, జూలై 6 : గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. కేంద్ర ఆరోగ్యశాఖ ద్వారా నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్‌ను పొందింది. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు మంగళవారం రాత్రి ట్వీట్ చేశారు. గజ్వేల్ ప్రభు త్వ దవాఖాన వైద్యసేవలు, నిర్వహణకు గాను గతంలో మూడుసార్లు కాయకల్ప అవార్డు దక్కిం ది. దీంతో దవాఖాన నిర్వహణకు ప్రత్యేక నిధులు వచ్చాయి. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ కోసం ఏప్రిల్ 11, 12, 13వ తేదీల్లో మూడు రోజుల పాటు దవాఖానను పరిశీలించారు. దవాఖానలోని ఓపీ, ఎమర్జెన్సీ, పీడియాట్రిక్ వార్డు నిర్వహణ, రేడియాలజీ, ఇన్, ఔట్ పేషెంట్ వార్డులు, ఫార్మసీ, డయాగ్నోస్టిక్, శానిటైజేషన్, లేబర్‌రూం, మెటర్నిటీ ఔట్ పేషె ంట్ వార్డు తదితర 12 విభాగాల ను సందర్శించారు. దవాఖాన నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలకు 88శాతం, లేబర్ రూం నిర్వహణకు 97శాతం, మెటర్నటీ, ఓటీ విభాగాల నిర్వహణకు 96శాతం మార్కులు సాధించి, సర్టిఫికేషన్ పొందినట్లు మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
మూడేండ్ల పాటు రూ.10లక్షల చొప్పున నిధులు
నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాస్ -ఎన్‌క్యూఎఎస్) సర్టిఫికేషన్‌తో గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు మరిన్ని నిధులు రానున్నాయి. ఎన్‌క్యూఎఎస్ సర్టిఫికేషన్‌తో గజ్వేల్ప్రభుత్వ దవాఖానకు మూడేండ్ల పాటు ప్రతి సంవత్సరం రూ.10లక్షల చొప్పున కేంద్ర ఆరోగ్యశాఖ నిధులను అందించనున్నది. ఇప్పటికే అధునాతన సౌకర్యాలతో నిర్మించిన గజ్వేల్ ప్రభుత్వ దవఖాన సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలతో పాటు రంగారెడ్డి, వరంగల్, సిరిసిల్ల జిల్లాల ప్రజలకు మాత్రమే సేవలందించగా, ఈ సేవలను మరింతగొప్పగా అందించడానికి అవకాశం లభించింది.
నాణ్యతా ప్రమాణాలతోనే ఈ గౌరవం
గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, సిబ్బంది నిబద్ధతతో పని చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్ ఎప్పటికప్పుడు దవాఖాన తీరుతెన్నులను తెలుసుకుంటున్నారు. రోగులను పూర్తి ఆరోగ్యవంతులుగా చేయడమే కాకుండా దవాఖాన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటాం. పారిశుధ్యం, పచ్చదనాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నాం. దీంతో రోగులకు అహ్లాదకర, ఆరోగ్యకర దవాఖాన పరిసరాలను తీర్చిదిద్దగలిగాం. ఈ సర్టిఫికేషన్‌తో దవాఖానను మరింత ఉన్నతంగా నిర్వహించడానికి అవసరమైన నిధులు సమకూరనున్నాయి. – సాయికిరణ్, సూపరింటెండెంట్, గజ్వేల్ దవాఖాన