మెదక్ అర్బన్/ మనోహరాబాద్, జూలై 6 : జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధ్దంగా ఉండాలని జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. హరితహారంలో భాగంగా అదనపు కలెక్టర్ నిర్దేశించిన 20 వేల మొక్కలను ఈ యేడాది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నాటాలని సూచించారు. ముందుగా మొక్కలను నాటడానికి అనువైన స్థలాలను గుర్తిం చి, గుంతలను తీసి సిద్ధం చేసుకోవాలన్నారు. శాస్త్రీ య పద్ధ్దతిలో మొక్కలను నాటాలని, సమీప నర్స రీ నుంచి మొక్కలను సమకూర్చుకోవాలని సూ చించారు. ‘హరిత బడి’ పనుల్లో స్థానిక ప్రజాప్రతినిధులను, ఎస్ఎంసీ సభ్యులు, పోషకులను భాగస్వామ్యం చేయాలని తెలిపారు.
మొక్కలను నాటి సంరక్షించాలి : ఎస్సై రాజుగౌడ్
ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని, మొక్క లను నాటి సంరక్షించాలని ఎస్సై రాజుగౌడ్ అన్నా రు. మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ ఆవరణ, స్టేషన్ కు వచ్చేదారిలో 200 మొక్కలను సిబ్బందితో కలి సి నాటారు. నాటే ప్రతి మొక్క భవిష్యత్ తరాలకు అపార సంపద అని, పచ్చదనమే లక్ష్యంగా ఒక్కొక్కరు ఐదు మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌సీలు శ్రీనివాస్, కిష్టాగౌడ్, ఏఎస్సై మూర్తి, సిబ్బంది కృష్ణ, రామయ్య, విఠల్, మహిపాల్, ప్రసాద్, తస్లీ, పద్మ పాల్గొన్నారు.