చిలిపిచెడ్, జూలై 5 : మండలంలోని 11 పాఠశాలలకు ‘మనఊరు – మనబడి’లో రూ.5.72 కోట్లు మంజూరైనట్లు పీఆర్ ఏఈ మధుబాబు, ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి అన్నారు. మంగళవారం చిలిపిచెడ్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ.. పది, ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలి పారు. మండలంలోని ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 178 మంది పరీక్ష హాజకాగా 170 మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు.
చిలిపిచెడ్ ఉన్న త పాఠశాల వంద శాతం, ఇతర పాఠశాలల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా పుస్తకా లు ఇవ్వడంతోపాటు అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు. వ్యవసాయాధికారి బాల్రెడ్డి మాట్లాడు తూ.. మండలంలో రైతుబంధు, రైతుబీమా పథకాలు పకడ్బం దీగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందిస్తున్నమని మండల ఏఈ అన్వేశ్రెడ్డి తెలిపారు. ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి మాట్లాడుతూ.. మండలాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతిధులు సమన్వయం తో పని చేయాలని సూచించారు. ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించా లని సర్పంచ్లను కోరారు. ప్రతి గ్రామంలో హరితహారంలో భారీసంఖ్యలో మొక్కలను నాటాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో శశిప్రభ, వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి, కోఅప్షన్ ఫఫి, తహసీల్దార్ కమలాద్రి, సర్పంచ్లు పాల్గొన్నారు.