తూప్రాన్, అక్టోబర్ 13: సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో పలు పార్టీల నాయకులు చేరుతున్నారని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన సమక్షంలో తూప్రాన్ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ జిల్లా నాయకుడు చిటిమిల్ల అనిల్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సం క్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ విధానాలు నచ్చకనే ఆయా పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. మునుగోడులో టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమన్నారు. మోదీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారన్నారు. రై తాంగానికి అండగా నిలబడి, వారి సంక్షేమానికి పాటుపడేది కేవలం టీఆర్ఎస్సేనని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాణీ సత్యనారాయణగౌడ్, సర్పంచుల ఫోరం కన్వీనర్ మహిపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్లు కొడిప్యాక నారాయణగుప్తా, రవీందర్‌రెడ్డి, మా మిండ్ల జ్యోతీకృష్ణ, టీఆర్ఎస్, పట్టణ అధ్యక్షుడు సతీశ్‌చారి, నాయకులు మన్నె శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శివమ్మ తదితరులు పాల్గొన్నారు.
కంగ్టి, అక్టోబర్ 13: మండలంలోని చాప్టా(బీ) గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గురువారం నారాయణఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గోవింద్రావు, ప్రశాంత్‌రావు, మారుతిరా వు ఉన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతుబంధు మండల అధ్యక్షుడు ఆంజనేయులు, తడ్కల్ గ్రామ సర్పంచ్ గడ్డం మనోహర్, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.