మెదక్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో నీటి సంరక్షణకు వివిధ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాలు, పనులు బాగున్నాయని కేంద్రప్రభుత్వ జల వనరుల మంత్రిత్వశాఖ సెంట్రల్ నోడల్ అధికారి డైరెక్టర్ డోనర్ హవోకిప్ ప్ర శంసించారు. జలశక్తి అభియాన్‌లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు గ్రామీణాభివృద్ధి, అటవీ, వ్యవసాయ, ఉ ద్యానవన, ఇంజినీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి మూడు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చారు. టెక్నీకల్ ఆఫీసర్, శాస్త్రవేత్త యూబీ పాటిల్‌తో వచ్చిన ఆయన బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలశక్తి అభియాన్ పథకంలో 2019 నుంచి చేపట్టిన వివిధ కార్యక్రమాలు బాగున్నాయరని తెలిపారు. విజన్‌తో పర్యావరణ సమతుల్యానికి చేపట్టిన అడవుల పెంపకం, పల్లెప్రకృతి వనాలు, బృహత్ పల్లెప్రకృతి వనాల పెంపకాలు బాగున్నాయని పేర్కొ న్నారు. అడవుల పెంపకంతో జిల్లాలో భూగర్భ జలమట్టాలు పెరిగి సేఫ్జోన్లో ఉందన్నారు. మా మణిపూర్ రాష్ట్రంలో అ డవులు తగ్గాయని, అలాగే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. మెదక్ జిల్లా రైతులు ప్రధానంగా వరి పండిస్తున్నారని, తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు.
మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో నీటి వనరులను సంరక్షించుకోవడంతోపాటు, పొదుపుగా వాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జిల్లాలో ఆరేడు సంవత్సరాల నుంచి నీటి వనరులను సంరక్షించడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు సత్ఫాలితాలు ఇస్తున్నాయన్నారు. వాననీరు, సంప్రదాయక నీటివనరులను సంరక్షించడానికి ఉపాధిహామీ పథ కం, సోషల్ ఫారెస్ట్రీ, నీటిపారుదల అధికారులతో అనేక చర్య లు చేపట్టామని వివరించారు. ఇందులో భాగంగా చెక్‌డ్యాం లు, పేర్కొలేషన్ ట్యాంకులు, ఫీడర్ చాన్నాళ్లు, ఫార్మ్ పాండ్స్, ట్రెంచ్, సోక్‌పిట్ ఏర్పాటు, వాటర్‌షెడ్ నిర్మాణం, రీచార్జి బోరుబావులను 11,129 నిర్మాణాలు చేపట్టి, 3,289 నిర్మాణాలు పూర్తి చేశామని, 7,890 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మిషన్ కాకతీయ, 539 నివాస ప్రాంతాల్లో చేపట్టిన పల్లెప్రకృతి వనాలు, 21 మండలాల్లో చేపట్టిన బృ హత్ పల్లెప్రకృతి వనాలు, హరితహారం కార్యక్రమాలతో వా తావరణ సమతుల్యతతోపాటు భూగర్భ జలాల నీటిమట్టం 7 మీటర్లు పెరిగాయని తెలిపారు. జిల్లాలోని 2,389 చెరువులు పూర్తి నీటి నిలువ సామర్థ్యంతో ఉన్నాయన్నారు.
మెదక్ జిల్లాలో అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ కార్యక్రమాలను డీఆర్డీవో శ్రీనివాస్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో జడ్పీసీఈవో శైలేశ్, డీపీ వో తరుణ్‌కుమార్, ఎంపీడీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.